చైనా మాంజ తగిలి యువకునికి గాయాలు

మండల కేంద్రంలో చైనా మాంజ తగిలి యువకునికి గాయాలయ్యాయి.

Update: 2025-01-14 09:43 GMT
చైనా మాంజ తగిలి యువకునికి గాయాలు
  • whatsapp icon

దిశ, నవీపేట్ : మండల కేంద్రంలో చైనా మాంజ తగిలి యువకునికి గాయాలయ్యాయి. మండల కేంద్రంలోని స్టేషన్ ఏరియా ప్రాంతంలో చైనా మాంజతో ఉన్న పతంగి తెగిపోగా పట్టుకునేందుకు ప్రయత్నించిన అద్నాన్ మెడకు చుట్టుకొని గొంతుకు గాయమైంది. దానిని చేతితో తీసేందుకు ప్రయత్నించగా కుడి చేతి వేళ్లు సైతం తెగాయి. వెంటనే హాస్పిటల్ కు తరలించగా గొంతుకు, చేతి వేళ్లకు నాలుగు కుట్లు వేసి చికిత్స అందించారు. చైనా మాంజ విక్రయించినా వ్యాపారులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 


Similar News