Crime News: దారుణం.. మహిళను హత్య చేసి యువకుడు సూసైడ్
మహిళను హత్య చేసి యువకుడు సూసైడ్
దిశ, డైనమిక్ బ్యూరో: పండగ పూట దారుణం వెలుగు చూసింది. హైదరాబాద్ నార్సింగి (Narsingi) పరిధిలోని పుప్పాలగూడలో ఓ మహిళ దారుణ హత్య (Woman Murder) కు గురైంది. మహిళను హత్య చేసిన యువకుడు ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అనంత పద్మనాభ స్వామి ఆలయం సమీపంలోని గుట్టల వద్ద ఇద్దరి డెడ్ బాడీలను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.