పర్యటనలో చేదు అనుభవం.. ఆ అధ్యక్షుడికి చెంపదెబ్బ
ప్యారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రన్‌కు చేదు అనుభవం ఎదురైంది. కరోనా అనంతరం సాధారణ పరిస్థితుల పునరుద్ధరణను పరిశీలించడానికి ఆగ్నేయ ఫ్రాన్స్‌లోని డ్రోమ్ రీజియన్‌లో ఆయన పర్యటిస్తూ ప్రజలతో ముచ్చటిస్తుండగా ఓ వ్యక్తి మందిలో నుంచి ఆయనపై చేయిచేసుకున్నాడు. అధ్యక్షుడు మాక్రన్ డౌన్ డౌన్ అంటూ ఆయన చెంప చెల్లుమనిపించాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ప్రెసిడెంట్‌కు వెంటనే అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లి రక్షణనిచ్చారు. పర్యటనలో భాగంగా ఆయన మెటల్ […]
ప్యారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రన్‌కు చేదు అనుభవం ఎదురైంది. కరోనా అనంతరం సాధారణ పరిస్థితుల పునరుద్ధరణను పరిశీలించడానికి ఆగ్నేయ ఫ్రాన్స్‌లోని డ్రోమ్ రీజియన్‌లో ఆయన పర్యటిస్తూ ప్రజలతో ముచ్చటిస్తుండగా ఓ వ్యక్తి మందిలో నుంచి ఆయనపై చేయిచేసుకున్నాడు. అధ్యక్షుడు మాక్రన్ డౌన్ డౌన్ అంటూ ఆయన చెంప చెల్లుమనిపించాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ప్రెసిడెంట్‌కు వెంటనే అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లి రక్షణనిచ్చారు. పర్యటనలో భాగంగా ఆయన మెటల్ బారియర్‌కు అటువైపుగానున్న పౌరులతో చేతులు కలుపుతూ ముందుకు కదులుతూ మాట్లాడారు. అక్కడే గ్రీన్ కలర్ టీషర్ట్ వేసుకున్న ఓ వ్యక్తి అధ్యక్షుడి చేతిని చేతిలోకి తీసుకుని ఈ ఘటనకు పాల్పడ్డాడు.