స్వాతంత్ర సమరయోధుడు దొరెస్వామి ఇకలేరు..

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు దొరెస్వామి ఇకలేరు. ఆయన గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు మధ్యాహ్నం 1.40గంటలకు బెంగుళూరులో  గుండెపోటుతో మృతి చెందినట్లు ఆయన సన్నిహితుడు సిరిమానే నాగరాజు వెల్లడించారు. దారెస్వామి స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనందుకు 14 నెలల జైలు శిక్ష అనుభవించారు. అంతేకాకుండా దేశంలో ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ప్రధాని ఇందిరాగాంధీకి లేఖ రాసినందుకు జైలుకెళ్లారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత సామాజిక […]

Update: 2021-05-26 06:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు దొరెస్వామి ఇకలేరు. ఆయన గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు మధ్యాహ్నం 1.40గంటలకు బెంగుళూరులో గుండెపోటుతో మృతి చెందినట్లు ఆయన సన్నిహితుడు సిరిమానే నాగరాజు వెల్లడించారు. దారెస్వామి స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనందుకు 14 నెలల జైలు శిక్ష అనుభవించారు. అంతేకాకుండా దేశంలో ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ప్రధాని ఇందిరాగాంధీకి లేఖ రాసినందుకు జైలుకెళ్లారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత సామాజిక కార్యకర్తగా, జర్నలిస్టుగా పనిచేసిన దొరెస్వామి మృతికి కర్ణాటక సీఎం యాడ్యూరప్పతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Tags:    

Similar News