కరోనాతో తల్లిదండ్రులు కోల్పోయిన విద్యార్థులకు ఫ్రీ స్కాలర్‌షిప్స్

దిశ, డైనమిక్ బ్యూరో : కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఆదుకునేందుకు కొటాక్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. ‘కొటాక్ శిక్సా నిధి’ పేరిట పిల్లల చదువులకోసం స్కాలర్‌షిప్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న పిల్లలకు ఈ స్కాలర్‌షిప్స్ అందించనున్నారు. కానీ, ఈ స్కాలర్‌షిప్‌ను కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయినవారు, లేదా సింగిల్ పేరెంట్ ను కోల్పోయిన వారు, పేరెంట్స్ కాకుండా ఆర్థిక తోడ్పాటును అందించే ఇతర కుటుంబసభ్యులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలకు అందించనున్నారు. ఒకటో తరగతి […]

Update: 2021-11-24 06:23 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఆదుకునేందుకు కొటాక్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. ‘కొటాక్ శిక్సా నిధి’ పేరిట పిల్లల చదువులకోసం స్కాలర్‌షిప్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న పిల్లలకు ఈ స్కాలర్‌షిప్స్ అందించనున్నారు. కానీ, ఈ స్కాలర్‌షిప్‌ను కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయినవారు, లేదా సింగిల్ పేరెంట్ ను కోల్పోయిన వారు, పేరెంట్స్ కాకుండా ఆర్థిక తోడ్పాటును అందించే ఇతర కుటుంబసభ్యులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలకు అందించనున్నారు. ఒకటో తరగతి నుంచి డిగ్రీ చదివేవారు అర్హులుగా పేర్కొంది. దీనికి అప్లై చేయాలనుకునేవారు www.kotakeducation.org/kotak-shiksha-nidhi వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. ఈ స్కాలర్‌షిప్‌ కొరకు ఎలా అప్లై చేయాలో అన్ని క్లుప్తంగా పొందుపరిచారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు అప్లికేషన్స్ తీసుకోనున్నారు.

Tags:    

Similar News