Russia: న్యూ ఇయర్ వేళ కీవ్‌పై విరుచుకుపడ్డ రష్యా.. డ్రోన్లతో భారీ దాడి

కొత్త ఏడాదిలోనైనా యుద్ధానికి తెరపడాలని పలువురు భావించారు. కానీ 2025 ప్రారంభమైన గంటల వ్యవధిలోనే ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది.

Update: 2025-01-01 14:42 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కొత్త ఏడాదిలోనైనా రష్యా (Russia) ఉక్రెయిన్ (Ukrein) యుద్ధానికి తెరపడాలని పలువురు భావించారు. కానీ 2025 ప్రారంభమైన గంటల వ్యవధిలోనే ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ (Keev) నగరంపై దాడి చేసింది. సుమారు 100కు పైగా క్షిపణులతో విరుచుకుపడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు గాయపడ్డట్టు ఉక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ వెల్లడించింది. పలు అపార్ట్ మెంట్లు దెబ్బతినగా పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్టు తెలిపింది. బుధవారం తెల్లవారుజామునే ఈ దాడికి పాల్పడగా భారీ శబ్దాలతో ప్రజలు భయబ్రాంతులకు గురైనట్టు పేర్కొంది. రష్యా డ్రోన్లు అధ్యక్ష భవనం, ప్రభుత్వ క్వార్టర్ ఉన్న రాజధాని పెచెర్స్కీ జిల్లాను లక్ష్యంగా చేసుకున్నాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈ దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelensky) ధ్రువీకరించారు. ‘కొత్త ఏడాది రోజు కూడా. ఉక్రెయిన్‌ను దెబ్బతీయడం గురించి మాత్రమే రష్యా ఆలోచిస్తుంది. ఇది సరైన పద్దతి కాదు’ అని పేర్కొన్నారు. మొత్తం 111 రష్యన్ డ్రోన్‌లు ఉక్రెయిన్‌పై ప్రయోగించారని, 109 డ్రోన్లు ఉక్రెయిన్ దళాలు కాల్చి వేశాయని తెలిపారు. 

Tags:    

Similar News