డిజిటల్ వైపు భారత్ పరుగులు.. కొనసాగనున్న ఎఫ్‌పీఐలు
దిశ, వెబ్‌డెస్క్: విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు(ఎఫ్‌పీఐ) దేశీయ మార్కెట్లో ఇంకా కొనసాగుతూనె ఉన్నాయి. ఈ నెలలో ఇప్పటివరకు మొత్తం రూ. 24,965 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు డిపాజిటరీస్ గణాంకాలు తెలిపాయి. ఇందులో ఈక్విటీ మార్కెట్లోకి రూ. 24,204 కోట్లు రాగా, రూ. 761 కోట్లు డెట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసినట్టు గణాంకాలు పేర్కొన్నాయి. ఇంతకుముందు జనవరిలో భారత్‌లోకి వచ్చిన ఎఫ్‌పీఐలు నికరంగ రూ. 14,649 కోట్లుగా నమోదయ్యాయి. 2021లో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా ఉంటుందని […]
దిశ, వెబ్‌డెస్క్: విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు(ఎఫ్‌పీఐ) దేశీయ మార్కెట్లో ఇంకా కొనసాగుతూనె ఉన్నాయి. ఈ నెలలో ఇప్పటివరకు మొత్తం రూ. 24,965 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు డిపాజిటరీస్ గణాంకాలు తెలిపాయి. ఇందులో ఈక్విటీ మార్కెట్లోకి రూ. 24,204 కోట్లు రాగా, రూ. 761 కోట్లు డెట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసినట్టు గణాంకాలు పేర్కొన్నాయి. ఇంతకుముందు జనవరిలో భారత్‌లోకి వచ్చిన ఎఫ్‌పీఐలు నికరంగ రూ. 14,649 కోట్లుగా నమోదయ్యాయి.
2021లో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) అంచనా వేసిన నేపథ్యంలో ఎఫ్‌పీఐలు సానుకూలంగా ఉన్నాయని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ ఎస్ రంగనాథన్ చెప్పారు. దీనితోడు బడ్జెట్ ప్రతిపాదనల్లో సంస్కరణలు ఇన్వెస్టర్లలలో ఆశలు రేకెత్తించినట్టు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. డిజిటల్ భారత్ వైపునకు దేశం పయనించేలా సంస్కరణలు ఉన్న కారణంగా రానున్న నెలల్లోనూ ఎఫ్‌పీఐలు ఇదే ధోరణిలో కొనసాగుతాయని రంగనాథన్ అభిప్రాయపడ్డారు.