ఐపీఓకు రానున్న ఐఫోన్‌ల తయారీ సంస్థ
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ యాపిల్ ఐఫోన్‌లను విడిభాగాలను అసెంబుల్ చేసే ఎలక్ట్రానిక్ గాడ్జెట్ తయారీ కాంట్రాక్ట్ కంపెనీ ఫాక్స్‌కాన్ త్వరలో భారత మార్కెట్లో ఐపీఓకు రానున్నట్టు ప్రకటించింది. ఐఫోన్‌లకు సంబంధించి ఇప్పటికే ఈ సంస్థకు దేశీయంగా యూనిట్ కేంద్రాలున్నాయి. ఇదివరకే ఉన్న వేల కోట్ల పెట్టుబడులకు తోడు నిధులను సమీకరించాలని భావిస్తోంది. దీనికోసం ఐపీఓ ద్వారా రూ. 5,000 కోట్లను సేకరించాలని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఫాక్స్‌కాన్ ఇప్పటివరకు భారత […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ యాపిల్ ఐఫోన్‌లను విడిభాగాలను అసెంబుల్ చేసే ఎలక్ట్రానిక్ గాడ్జెట్ తయారీ కాంట్రాక్ట్ కంపెనీ ఫాక్స్‌కాన్ త్వరలో భారత మార్కెట్లో ఐపీఓకు రానున్నట్టు ప్రకటించింది. ఐఫోన్‌లకు సంబంధించి ఇప్పటికే ఈ సంస్థకు దేశీయంగా యూనిట్ కేంద్రాలున్నాయి. ఇదివరకే ఉన్న వేల కోట్ల పెట్టుబడులకు తోడు నిధులను సమీకరించాలని భావిస్తోంది. దీనికోసం ఐపీఓ ద్వారా రూ. 5,000 కోట్లను సేకరించాలని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఫాక్స్‌కాన్ ఇప్పటివరకు భారత మార్కెట్లోకి ప్రవేశించలేదు. ఈ క్రమంలో ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) జారీ ద్వారా రూ. 5 వేల కోట్లను సేకరించాలని నిర్ణయించింది. కాగా, ఇటీవల భారత్‌లో పరిణామాలను అనుసరించి కార్యకలాపాలను విస్తరించేందుకు రూ. 7,500 కోట్ల పెట్టుబడులను పెట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోన్న సంగతి తెల్సిందే. ఈ అంశంపై గతేడాది రెండో త్రైమాసికంలో ఓ ప్రకటనను ఇచ్చింది.