జమ్ము ఎన్‎కౌంటర్‎లో నలుగురు ఉగ్రవాదులు హతం

దిశ, వెబ్‎డెస్క్: జమ్మూ కశ్మీరులోని బాన్ టోల్ ప్లాజా వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. గురువారం తెల్లవారుజామున భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు జమ్ము నుంచి శ్రీనగర్ కు బస్సులో వెళుతుండగా నగరోటా వద్ద భద్రతాబలగాలు జాతీయ రహదారిని మూసివేసి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులు జరిపారు. దీంతో కేంద్ర భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. అనంతరం కేంద్ర […]

Update: 2020-11-18 20:42 GMT

దిశ, వెబ్‎డెస్క్: జమ్మూ కశ్మీరులోని బాన్ టోల్ ప్లాజా వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. గురువారం తెల్లవారుజామున భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు జమ్ము నుంచి శ్రీనగర్ కు బస్సులో వెళుతుండగా నగరోటా వద్ద భద్రతాబలగాలు జాతీయ రహదారిని మూసివేసి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులు జరిపారు. దీంతో కేంద్ర భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. అనంతరం కేంద్ర బలగాలతో గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు బుధవారం పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన గ్రనేడ్ దాడిలో 12 మంది పౌరులు గాయపడ్డారు.

Tags:    

Similar News