రేప్‌ కేసులో నలుగురికి యావజ్జీవం

జైపూర్: రాజస్తాన్‌లోని అల్వార్‌లో గతేడాది 19 ఏళ్ల దళిత మహిళపై జరిగిన సామూహిక లైంగికదాడి కేసులో స్పెషల్ కోర్టు తీర్పు వెలువరించింది. నలుగురు దోషులకు యావజ్జీవ శిక్ష విధించింది. ఐటీ యాక్ట్ కింద దోషిగా తేలిన మరొకరికి ఐదేళ్ల కారాగారవాసాన్ని విధించింది. కాగా, మరో నిందితుడు మైనర్ కావడంతో ప్రత్యేకంగా విచారణ సాగిస్తున్నారు. గతేడాది ఏప్రిల్‌లో తన భర్త ఎదుటే ఐదుగురు నిందితులు తనపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారని, ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ […]

Update: 2020-10-06 05:53 GMT

జైపూర్: రాజస్తాన్‌లోని అల్వార్‌లో గతేడాది 19 ఏళ్ల దళిత మహిళపై జరిగిన సామూహిక లైంగికదాడి కేసులో స్పెషల్ కోర్టు తీర్పు వెలువరించింది. నలుగురు దోషులకు యావజ్జీవ శిక్ష విధించింది. ఐటీ యాక్ట్ కింద దోషిగా తేలిన మరొకరికి ఐదేళ్ల కారాగారవాసాన్ని విధించింది. కాగా, మరో నిందితుడు మైనర్ కావడంతో ప్రత్యేకంగా విచారణ సాగిస్తున్నారు.

గతేడాది ఏప్రిల్‌లో తన భర్త ఎదుటే ఐదుగురు నిందితులు తనపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారని, ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆల్వర్-తానాగాజి రోడ్డుపై నిందితులు ద్విచక్ర వాహనాలపై వచ్చి భార్యభర్తలను అపహరించి ఈ దాడికి పాల్పడ్డారని ఎఫ్ఐఆర్ పేర్కొంది. రూ. 2,000లు దోపిడీ చేసి వీడియోను చూపెడుతూ మరో పది వేలు ఇవ్వాలని బాధితులను ఒత్తిడి చేశారు. బాధితుల ఫిర్యాదును ఖాతరు చేయని పోలీసుల నిర్లక్ష్యంపై దేశవ్యాప్తంగా నిరసనలు వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల వరకూ బీజేపీ నేతలు గెహ్లాట్ సర్కారుపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. దేశవ్యాప్త ఆందోళనలతో సర్కారు పోలీసులపై యాక్షన్ తీసుకుంది. తాజాగా, ఈ కేసులో దోషులకు శిక్ష పడింది.

Tags:    

Similar News