ఆ నలుగురూ ఎంతమందికి అంటించారు?
కరోనా వైరస్ మహమ్మారి గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో విస్తరిస్తోంది. దీనికి సాక్ష్యం గత రెండు రోజులుగా ఏపీలో పదుల సంఖ్యలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు కావడమే. గత నెల 13 నుంచి 15 మధ్యలో ఢిల్లీలోని తబ్లిగి జమాత్ మర్కజ్‌కు వెళ్లిన నలుగురూ కరోనా బారిన పడ్డారు. ఇదే ఆందోళన రేపుతోంది. తబ్లిగి జమాత్ అంటే అల్లా మాటలను బోధించే సంస్థ ఈ సంస్థలో ప్రతి ముస్లిం భాగస్వామి కాలేడు. అల్లాపై అచంచల విశ్వాసంతో […]
కరోనా వైరస్ మహమ్మారి గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో విస్తరిస్తోంది. దీనికి సాక్ష్యం గత రెండు రోజులుగా ఏపీలో పదుల సంఖ్యలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు కావడమే. గత నెల 13 నుంచి 15 మధ్యలో ఢిల్లీలోని తబ్లిగి జమాత్ మర్కజ్‌కు వెళ్లిన నలుగురూ కరోనా బారిన పడ్డారు. ఇదే ఆందోళన రేపుతోంది.
తబ్లిగి జమాత్ అంటే అల్లా మాటలను బోధించే సంస్థ ఈ సంస్థలో ప్రతి ముస్లిం భాగస్వామి కాలేడు. అల్లాపై అచంచల విశ్వాసంతో పాటు మత సిద్ధాంతాలను బోధించాలన్న కుతూహలం ఉన్నవారే దీనిలో పాల్గొనగలరు. అంటే మసీదులో ఖురాన్‌పై అవగాహన ఉంటూ దానిని విశ్లేషించగలిగినవారే.. ఆ స్థాయి మౌల్వీలకే ఉంటుందన్నది తోసిపుచ్చలేని వాస్తవం. ఈ నేపధ్యంలో ఢిల్లీలోని మర్కజ్‌కి వెళ్లిన వారు మౌల్వీలా? అన్న సందేహం కలుగుతుంది.
మౌల్వీలైతే వారిని కలిసినవారతా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్యఆరోగ్య శాఖాధికారులు చెబుతున్నారు. ఢిల్లీలో జరిగిన మర్కజ్‌లో పాల్గొన్న నలుగురు విశాఖ వాసులు కరోనా బారిన పడడం అధికార వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా వారి వరకే వచ్చిందా? లేక వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులకు కూడా సోకిందా? అన్న భయం కలుగుతోంది. ఈ నేపధ్యంలోనే ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అనుమానమున్న ప్రతి ఒక్కరూ వైద్య సహాయం తీసుకోవాలని సూచిస్తోంది.
అలాగే వారంతా క్వారంటైన్ లేదా ఐసోలేషన్‌లో ఉండాల్సిన అవసరం ఉందని చెబుతోంది. ఏపీలో ఇప్పటి వరకు 87 కేసులు నమోదైతే.. కడప, ప్రకాశం జిల్లాల్లో అత్యధికంగా 15 చొప్పున కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 13, విశాఖలో 11, గుంటూరులో 9, చిత్తూరు, కృష్ణా, తూర్పుగోదావరిల్లో 6 చొప్పున, నెల్లూరులో 3, అనంతపురంలో 2, కర్నూలు జిల్లాలో ఒక్క కేసు నమోదయ్యాయి. ఏపీలో మొత్తం 87 కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్ బాధితుల్లో ఇద్దరు వ్యక్తులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
Tags: coronavirus, covid-19, andhra pradesh, positive cases, cases increased, tablighi jamaat markaz, Delhi