డాక్టర్లా.. రాక్షసులా.. 20 ఏళ్ల కరోనా రోగిపై నలుగురు వైద్యుల అత్యాచారం

దిశ, వెబ్‌డెస్క్: దేవుడి తర్వాత దేవుడిలా కొలిచేది డాక్టర్ నే. ఈ కరోనా సమయంలో వారే ప్రజలకు దేవుళ్లు. కానీ అలాంటి వైద్యులే కామంతో కళ్ళుమూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. వైద్యం కోసం వచ్చిన మహిళా రోగులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. తాజాగా వైద్యం కోసం వచ్చిన ఓ కరోనా రోగిని నలుగురు వైద్యులు దారుణంగా అత్యాచారం చేసి ఆమె మరణానికి కారణమయ్యారు. కరోనాతో బాధపడుతున్నదన్న కనికరం కూడా లేకుండా యువతిపై లైంగిక వాంఛ తీర్చుకున్నారు. ఈ దారుణ ఘటన […]

Update: 2021-06-10 00:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేవుడి తర్వాత దేవుడిలా కొలిచేది డాక్టర్ నే. ఈ కరోనా సమయంలో వారే ప్రజలకు దేవుళ్లు. కానీ అలాంటి వైద్యులే కామంతో కళ్ళుమూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. వైద్యం కోసం వచ్చిన మహిళా రోగులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. తాజాగా వైద్యం కోసం వచ్చిన ఓ కరోనా రోగిని నలుగురు వైద్యులు దారుణంగా అత్యాచారం చేసి ఆమె మరణానికి కారణమయ్యారు. కరోనాతో బాధపడుతున్నదన్న కనికరం కూడా లేకుండా యువతిపై లైంగిక వాంఛ తీర్చుకున్నారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల యువతి చికిత్స నిమిత్తం ప్రయాగ్‌ రాజ్‌లోని స్వరూప్‌ రాణి నెహ్రు ఆసుపత్రి లో చేరింది. అక్కడ ఓ నలుగురు డాక్టర్లు ఆమెను చికిత్స పేరుతో తాకుతూ లైంగిక వేధింపులకు గురిచేశారు. దీంతో ఆమె వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అవేమి పట్టించుకోని ఆ డాక్టర్లు జూన్ 2 అర్ధరాత్రి ఆమెపై అత్యచారం చేసి వారి లైంగిక వాంఛ తీర్చుకున్నారు. ఇక ఏ ఈవిషయాన్ని బాధితురాలు ఆమె సోదరుడికి చెప్పగా జూన్‌ 3న బాధితురాలి సోదరుడు ఫిర్యాదు ఇవ్వగా… యువతి చనిపోయిన తర్వాత ప్రయాగ్‌రాజ్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయితే ఈ విషయంలో ప్రాథమిక విచారణ జరిపినందున ఎఫ్‌ఐఆర్‌కు దాఖలు చేయడంలో ఆలస్యం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఇక మరో పక్క తమ ఆసుపత్రిలో ఇలాంటి ఘటన జరిగినట్టు ఆనవాళ్లు లేవని, ఆ నలుగురు డాక్టర్లు ఎవరో కూడా తెలియదని ఆసుపత్రి యాజమాన్యం తెలపడం గమనార్హం. ఇక ఈ ఘటనపై విచారణ ముమ్మురం చేయాలనీ పోలీస్ ఉన్నతాధికారులు పోలీసులకు ఆదేశించారు.

Tags:    

Similar News