యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌కు కరోనా
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. గతంలో కంటే సెకండ్ వేవ్ మరింత ప్రతాపం చూపిస్తోంది. రికార్డు స్థాయిలో రోజువారీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజల్లో మళ్లీ టెన్షన్ మొదలైంది. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా కొంతమందికి కరోనా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌కు కరోనా పాజిటివ్‌గా […]
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. గతంలో కంటే సెకండ్ వేవ్ మరింత ప్రతాపం చూపిస్తోంది. రికార్డు స్థాయిలో రోజువారీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజల్లో మళ్లీ టెన్షన్ మొదలైంది. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా కొంతమందికి కరోనా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
అయితే ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్‌లో ప్రకటించారు.
अभी-अभी मेरी कोरोना टेस्ट की रिपोर्ट पॉज़िटिव आई है। मैंने अपने आपको सबसे अलग कर लिया है व घर पर ही उपचार शुरू हो गया है।
पिछले कुछ दिनों में जो लोग मेरे संपर्क में आये हैं, उन सबसे विनम्र आग्रह है कि वो भी जाँच करा लें। उन सभी से कुछ दिनों तक आइसोलेशन में रहने की विनती भी है।
— Akhilesh Yadav (@yadavakhilesh) April 14, 2021
‘నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల సూచనలు పాటిస్తున్నా. నన్ను ఇటీవల కలిసినవారందరూ కరోనా టెస్టులు చేయించుకోండి.. క్వారంటైన్‌లో ఉండండి’ అని అఖిలేష్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.