తెలంగాణకు చెందిన కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కెప్టెన్ సతీష్ శర్మ బుధవారం రాత్రి గోవాలో కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన పీవీ నర్సింహా రావు హయాంలో 1993 నుంచి 1996 వరకు కేంద్ర మంత్రిగా పని చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి సతీష్ శర్మ అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు. మూడుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఆయన.. అమేఠీ, రాయ్ బరేలీ నుంచి […]

Update: 2021-02-17 21:49 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కెప్టెన్ సతీష్ శర్మ బుధవారం రాత్రి గోవాలో కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన పీవీ నర్సింహా రావు హయాంలో 1993 నుంచి 1996 వరకు కేంద్ర మంత్రిగా పని చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి సతీష్ శర్మ అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు. మూడుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఆయన.. అమేఠీ, రాయ్ బరేలీ నుంచి మూడు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. సికింద్రాబాద్‌లో 1947 అక్టోబర్ 11న జన్మించిన ఆయనకు.. భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా సతీష్ శర్మ అంత్యక్రియలు శుక్రవారం ఢిల్లీలో నిర్వహించనున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

Tags:    

Similar News