ప్రివిలేజ్ కమిటీ సమావేశానికి మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ గైర్హాజరు
ఏపీ, బ్యూరో: మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను విచారణకు హాజరుకావాలని కోరితే హాజరు కాలేదని ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్థన్‌రెడ్డి తెలిపారు. సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన ప్రివిలేజ్ కమిటీ సమావేశానికి తాను కరోనా నేపథ్యంలో రాలేనని జవాబిచ్చారని వెల్లడించారు. అయితే ఆగస్టు 10న జరిగే తదుపరి సమావేశంలో నిమ్మగడ్డపై ఓ నిర్ణయం తీసుకుంటామని కాకాణి స్పష్టం చేశారు. తమ హక్కులను ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి […]
ఏపీ, బ్యూరో: మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను విచారణకు హాజరుకావాలని కోరితే హాజరు కాలేదని ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్థన్‌రెడ్డి తెలిపారు. సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన ప్రివిలేజ్ కమిటీ సమావేశానికి తాను కరోనా నేపథ్యంలో రాలేనని జవాబిచ్చారని వెల్లడించారు. అయితే ఆగస్టు 10న జరిగే తదుపరి సమావేశంలో నిమ్మగడ్డపై ఓ నిర్ణయం తీసుకుంటామని కాకాణి స్పష్టం చేశారు. తమ హక్కులను ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నానిలు అప్పటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.