రంగంలోకి బరాక్ ఒబామా..

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో నెలరోజుల సమయం మాత్రమే ఉండటంతో అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రంగంలోకి దిగారు. డెమొక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి జో బిడెన్‌, ఉపాధ్యక్ష రేసులో ఉన్న భారత సంతతి మహిళ కమలాహారీస్‌‌కు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఈనెల 21న ఫిలిడేల్ఫియా, పెన్సిల్వేనియాలో ఒబామా ప్రచారం కొనసాగనుంది. ఇదిలాఉండగా, ఒబామా ప్రచారంపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన ప్రచారం ఎన్నికలపై […]

Update: 2020-10-17 01:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో నెలరోజుల సమయం మాత్రమే ఉండటంతో అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రంగంలోకి దిగారు. డెమొక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి జో బిడెన్‌, ఉపాధ్యక్ష రేసులో ఉన్న భారత సంతతి మహిళ కమలాహారీస్‌‌కు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఈనెల 21న ఫిలిడేల్ఫియా, పెన్సిల్వేనియాలో ఒబామా ప్రచారం కొనసాగనుంది.

ఇదిలాఉండగా, ఒబామా ప్రచారంపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన ప్రచారం ఎన్నికలపై ఎంతమాత్రం ఉండబోదన్నారు.అందుకే 2016లో ప్రజలు తనకు పట్టం కట్టారని గుర్తుచేశారు. ఎవరొచ్చి ప్రచారం చేసినా గెలుపు మాత్రం తనదేనని ట్రంప్ స్పష్టంచేశారు. కాగా, నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ట్రంప్ మరోసారి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకుంటారా? చేజార్చుకుంటారా.. తెలియాలంటే ఎన్నికలు అయ్యే వరకు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News