మరికొన్ని వారాల్లో సీఎం జగన్ మాజీ కాబోతున్నారు…
దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్ర రాజకీయాలపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ పతనం ప్రారంభమైందన్నారు. త్వరలో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు రాబోతున్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన మరికొన్ని వారాల్లో సీఎం జగన్ మాజీ సీఎం కాబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే జగన్ బెయిల్ రద్దు కేసులో సీబీఐ తీరుపై ఆయన అనుమానాలు […]
దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్ర రాజకీయాలపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ పతనం ప్రారంభమైందన్నారు. త్వరలో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు రాబోతున్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
తిరుపతిలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన మరికొన్ని వారాల్లో సీఎం జగన్ మాజీ సీఎం కాబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే జగన్ బెయిల్ రద్దు కేసులో సీబీఐ తీరుపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. బెయిల్ కేసు నుంచి బయటపడేందుకు ఉత్తరాది పారిశ్రామిక వేత్త, కేంద్రమంత్రి కుమారుడి సాయాన్ని జగన్ కోరుతున్నారని తనకు తెలిసిందన్నారు.
సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ వ్యవహారం వాయిదా పడిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని.. ఆగష్టు 25న విచారణ జరగనుందని.. అదే రోజు కోర్టు తుది తీర్పును కూడా వెల్లడించే అవకాశం ఉందని చింతా మోహన్ అన్నారు. మరోవైపు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు అరెస్ట్‌ను ఆయన ఖండించారు.