కృష్ణారెడ్డి ప్రజల పక్షపాతిగా పనిచేశారు : మంత్రి

దిశ ప్రతినిధి, మేడ్చల్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మృతి ప‌ట్ల రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మాల్లారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కిష్టారెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రజల పక్షపాతిగా పని చేసిన వ్యక్తి కిష్ణారెడ్డి అని ఆయన సేవలు ప్రజలు ఎన్నటికీ మరిచిపోలేరని అన్నారు. విద్యుత్ అంతరాయంతో ప్రజలు, ముఖ్యంగా రైతులు ఇబ్బందులు పడుతుంటే వారి కష్టాలను గమనించి కల్వకుర్తి నియోజకవర్గంలో […]

Update: 2020-08-18 09:17 GMT

దిశ ప్రతినిధి, మేడ్చల్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మృతి ప‌ట్ల రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మాల్లారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కిష్టారెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రజల పక్షపాతిగా పని చేసిన వ్యక్తి కిష్ణారెడ్డి అని ఆయన సేవలు ప్రజలు ఎన్నటికీ మరిచిపోలేరని అన్నారు.

విద్యుత్ అంతరాయంతో ప్రజలు, ముఖ్యంగా రైతులు ఇబ్బందులు పడుతుంటే వారి కష్టాలను గమనించి కల్వకుర్తి నియోజకవర్గంలో అవసరం ఉన్న ప్రతిచోట విద్యుత్ సబ్‌స్టేషన్‌లు, ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేసి కరెంట్ కిష్ణారెడ్డి పేరు సంపాదించుకున్నారని ఆయన సేవలను మంత్రి కొనియాడారు. కిష్ణారెడ్డి ఆత్మకు శాంతి‌కలగాలని దేవుణ్ని ప్రార్ధిస్తున్నానని తెలిపారు.

Tags:    

Similar News