బిగ్ బ్రేకింగ్ : టీఆర్ఎస్‌కు వరుస షాకులిస్తున్న సర్దార్.. ‘సారా బుడ్ల’తో సీక్రెట్ మీట్..!
దిశ ప్రతినిధి, కరీంనగర్ : టీఆర్ఎస్ పార్టీ రెబల్ అభ్యర్థులుగా బరిలో నిలిచిన ఆ ఇద్దరు రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. నామినేషన్ల విత్ డ్రా ప్రక్రియ అనంతరం వీరిద్దరూ ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కరీంనగర్‌లోని ఓ హోటల్ ఈ లీడర్లు మంతనాలు జరపడం వెనక ఆంతర్యం ఏంటోనన్న చర్చ ఊపందుకుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదలైన తరువాత నామినేషన్ వేసిన సైదాపూర్ ఎంపీపీ, ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సారా బుడ్ల […]
దిశ ప్రతినిధి, కరీంనగర్ : టీఆర్ఎస్ పార్టీ రెబల్ అభ్యర్థులుగా బరిలో నిలిచిన ఆ ఇద్దరు రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. నామినేషన్ల విత్ డ్రా ప్రక్రియ అనంతరం వీరిద్దరూ ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కరీంనగర్‌లోని ఓ హోటల్ ఈ లీడర్లు మంతనాలు జరపడం వెనక ఆంతర్యం ఏంటోనన్న చర్చ ఊపందుకుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదలైన తరువాత నామినేషన్ వేసిన సైదాపూర్ ఎంపీపీ, ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సారా బుడ్ల ప్రభాకర్ రెడ్డి అధిష్టానాన్ని ధిక్కరించి మరీ నామినేషన్ వేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వారికి నిధుల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన నామినేషన్ వేసి అధికార టీఆరెఎస్ పార్టీకి మొదట ఝలక్ ఇచ్చారు. నామినేషన్ల దాఖలుకు చివరి రోజున కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ కూడా పోటీ చేసేందుకు సమాయత్తం అయ్యారు.
వీరిద్దరిని చివరి పోటీ నుంచి తప్పించేందుకు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత శనివారం రవీందర్ సింగ్, ప్రభాకర్ రెడ్డిలు ఓ హోటల్‌లో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక స్థానంలో తనకు అవకాశం కల్పించాలన్న నినాదంతో రవీందర్ సింగ్ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో తనతో పాటు పోటీలో ఉన్న సారా బుడ్ల ప్రభాకర్ రెడ్డితో సర్దార్జీ ప్రత్యేకంగా సమావేశం కావడం గమనార్హం. వీరిద్దరు కలిసి ఒక్కరి గెలుపు కోసమే ప్రచారం చేయాలని నిర్ణయించుకునే విషయంపై చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ఇండిపెండెంట్లుగా బరిలో అందరం నిలిస్తే ఓట్లు చీలిపోవడం వల్ల అధికార టీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైన ఫలితాలు వస్తాయని దీని వల్ల తమ లక్ష్యం నెరవేరే అవకాశం ఉండదన్న విషయంపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. అయితే, వీరిద్దరిలో ఎవరు ఎవరికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారోనన్నది మాత్రం రహస్యంగానే ఉంది. పూర్తి స్థాయిలో చర్చలు సఫలం అయిన తరువాత మీడియా ముందుకు వచ్చి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.