క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవోగా స్ట్రాస్?
దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుతం ఈసీబీ డైరెక్టర్ ఆండ్రూ స్ట్రాస్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) కొత్త సీఈవోగా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీఏతో విభేదాల నేపథ్యలో సీఈవో కెవిన్ రాబర్ట్స్ మంగళవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో నిక్ హోక్లేను తాత్కాలిక సీఈవోగా నియమించింది. క్రికెట్‌తోపాటు పరిపాలనలో కూడా అనుభవం ఉన్న ఆండ్రూ స్ట్రాస్ అయితే ఈ స్థానానికి న్యాయం చేకూరుస్తాడని సీఏ భావిస్తున్నది. దక్షిణాఫ్రికాలోని జొహెన్నెస్‌బర్గ్‌లో పుట్టిన స్ట్రాస్ […]
దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుతం ఈసీబీ డైరెక్టర్ ఆండ్రూ స్ట్రాస్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) కొత్త సీఈవోగా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీఏతో విభేదాల నేపథ్యలో సీఈవో కెవిన్ రాబర్ట్స్ మంగళవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో నిక్ హోక్లేను తాత్కాలిక సీఈవోగా నియమించింది. క్రికెట్‌తోపాటు పరిపాలనలో కూడా అనుభవం ఉన్న ఆండ్రూ స్ట్రాస్ అయితే ఈ స్థానానికి న్యాయం చేకూరుస్తాడని సీఏ భావిస్తున్నది. దక్షిణాఫ్రికాలోని జొహెన్నెస్‌బర్గ్‌లో పుట్టిన స్ట్రాస్ తన ఫస్ట్ గ్రేడ్ క్రికెట్‌ను ఆస్ట్రేలియాలోనే ప్రారంభించాడు. సిడ్నీ యూనివర్సిటీ తరఫున ఆడిన స్ట్రాస్.. ఆ తర్వాత ఇంగ్లాండ్ వచ్చి పలు కౌంటీలకు దేశవాళీ క్రికెట్ ఆడి ఇంగ్లాండ్ జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. కెవిన్ పీటర్సన్ తర్వాత ఇంగ్లాండ్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక ఈసీబీ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం కరోనా కారణంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా బోర్డులు ఆర్థికంగా తీవ్ర నష్టాల్లో ఉన్నాయి. ఈ రెండు దేశాల గురించి బాగా తెలిసిన స్ట్రాస్ అయితే సీఏలో ఏర్పడిన సంక్షోభాన్ని పరిష్కరించగలడని భావిస్తున్నారు. అయితే దీనిపై అటు స్ట్రాస్ కానీ, ఇటు సీఏ కానీ ఇంకా స్పందించలేదు.