మాజీ ముఖ్యమంత్రి ఆస్తులు సీజ్
దిశ, వెబ్‌డెస్క్: జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దులాను ఈడీ ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. జమ్ము కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ యొక్క నిధుల స్కామ్ విషయంలో ఫరూక్‌ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. క్రికెట్ అసోసియేషన్‌లో రూ.113 కోట్ల గోల్ మాల్ జరిగింది. అయితే ఈ కేసును కోర్టు సీబీఐకి అప్పగించింది. అనంతరం సీబీఐ ఈడీ అధికారులను అప్పజెప్పింది. దీంతో రంగంలోకి దిగిన ఈడీ ఫరూక్ క్రికెట్ అసోసియేషన్ ఛైర్మెన్‌గా ఉన్న సమయంలో రూ.43 కోట్ల మేర నిధుల […]
దిశ, వెబ్‌డెస్క్: జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దులాను ఈడీ ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. జమ్ము కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ యొక్క నిధుల స్కామ్ విషయంలో ఫరూక్‌ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. క్రికెట్ అసోసియేషన్‌లో రూ.113 కోట్ల గోల్ మాల్ జరిగింది. అయితే ఈ కేసును కోర్టు సీబీఐకి అప్పగించింది. అనంతరం సీబీఐ ఈడీ అధికారులను అప్పజెప్పింది. దీంతో రంగంలోకి దిగిన ఈడీ ఫరూక్ క్రికెట్ అసోసియేషన్ ఛైర్మెన్‌గా ఉన్న సమయంలో రూ.43 కోట్ల మేర నిధుల దుర్వినియోగం జరిగినట్లు గుర్తించింది. ఈ నేపథ్యంతో తాజగా శనివారం ఫరూక్ ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. రూ.11.86 కోట్ల విలువైన ఫరూక్ ఆస్తులను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.