ఐపీఎల్ ఎందుకూ పనికిరాదు : బోర్డర్
దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలన్ బోర్డర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీ20 ప్రపంచ కప్ నిర్వహించడానికి బదులు, ఐపీఎల్ నిర్వహించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపీఎల్ కన్నా టీ20 వరల్డ్ కప్‌కే ఎక్కువ ప్రాధానత్య ఇవ్వాలని ఆయన సూచించారు. అంతేగాకుండా ఐపీఎల్ టీ20 లీగ్ జేబులు నింపడానికి తప్ప ఎందుకూ పనికి రాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీ20 వరల్డ్‌కప్ కాదని, ఐపీఎల్ నిర్వహిస్తే అన్ని బోర్డులు తమ […]
దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలన్ బోర్డర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీ20 ప్రపంచ కప్ నిర్వహించడానికి బదులు, ఐపీఎల్ నిర్వహించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపీఎల్ కన్నా టీ20 వరల్డ్ కప్‌కే ఎక్కువ ప్రాధానత్య ఇవ్వాలని ఆయన సూచించారు. అంతేగాకుండా ఐపీఎల్ టీ20 లీగ్ జేబులు నింపడానికి తప్ప ఎందుకూ పనికి రాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీ20 వరల్డ్‌కప్ కాదని, ఐపీఎల్ నిర్వహిస్తే అన్ని బోర్డులు తమ ప్లేయర్స్‌ను ఐపీఎల్‌కు వెళ్లకుండా అడ్డుకోవాలని సూచనలు చేశారు. ఇక ఇండియా, ఆస్ట్రేలియా సిరీస్‌పై స్పందిస్తూ.. విరాట్ కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు. అతడు టెస్ట్ క్రికెట్‌ను బతికించగలడని బోర్డర్ అభిప్రాయపడ్డాడు.