అఖిల ప్రియకు మూడ్రోజుల పోలీస్ కస్టడీ
దిశ, క్రైమ్ బ్యూరో: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియకు కోర్టులో చుక్కెదురయ్యింది. బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన సికింద్రాబాద్ న్యాయస్థానం.. ఈనెల 13వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది. పది రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వాలని బోయిన్‌పల్లి పోలీసులు పిటిషన్ వేయగా.. మూడ్రోజుల వరకే అనుమతి ఇచ్చింది. అయితే తన హెల్త్ సరిగా లేదని పూర్తిస్థాయిలో సహకరించేందుకు సిద్ధమని అఖిలప్రియ చెప్పినప్పటికీ కోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో పోలీసులు అఖిలప్రియను […]
దిశ, క్రైమ్ బ్యూరో: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియకు కోర్టులో చుక్కెదురయ్యింది. బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన సికింద్రాబాద్ న్యాయస్థానం.. ఈనెల 13వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది. పది రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వాలని బోయిన్‌పల్లి పోలీసులు పిటిషన్ వేయగా.. మూడ్రోజుల వరకే అనుమతి ఇచ్చింది. అయితే తన హెల్త్ సరిగా లేదని పూర్తిస్థాయిలో సహకరించేందుకు సిద్ధమని అఖిలప్రియ చెప్పినప్పటికీ కోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో పోలీసులు అఖిలప్రియను అరెస్ట్ చేయగా.. ప్రస్తుతం పరారీలో ఉన్న అఖిలప్రియ భర్త భార్గవ రామ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.