జంపింగ్ ఎఫెక్ట్ : జ్యోతిరాదిత్య సింధియాపై కేసు
నకిలీ డాక్యుమెంట్లతో భూమిని విక్రయించారన్నకేసులో నిందితులుగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, అతని కుటుంబ సభ్యులపై తాజాగా అందిన ఫిర్యాదులో వాస్తవాలను పరిశీలించాలని ‘మధ్యప్రదేశ్ ఎకనమిక్ ఆఫెన్స్ వింగ్’ నిర్ణయించింది. సింధియా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన తరువాత ఈ కేసు వ్యవహారం బయటకు రావడం గమన్హారం. మహల్గావ్లో ఉన్న భూమిని 2009లో చేసుకున్న ఒప్పందం కంటే 6000 చదరపు అడుగులు చిన్నదిగా చేసి విక్రయించారని సింధియా కుటంబ సభ్యులపై ఆరోపిస్తూ శ్రీవాస్తవ గురువారం […]
నకిలీ డాక్యుమెంట్లతో భూమిని విక్రయించారన్నకేసులో నిందితులుగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, అతని కుటుంబ సభ్యులపై తాజాగా అందిన ఫిర్యాదులో వాస్తవాలను పరిశీలించాలని ‘మధ్యప్రదేశ్ ఎకనమిక్ ఆఫెన్స్ వింగ్’ నిర్ణయించింది. సింధియా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన తరువాత ఈ కేసు వ్యవహారం బయటకు రావడం గమన్హారం. మహల్గావ్లో ఉన్న భూమిని 2009లో చేసుకున్న ఒప్పందం కంటే 6000 చదరపు అడుగులు చిన్నదిగా చేసి విక్రయించారని సింధియా కుటంబ సభ్యులపై ఆరోపిస్తూ శ్రీవాస్తవ గురువారం తాజాగా ఫిర్యాదు చేశారని, ఇందులోని వాస్తవాలను ధృవీకరించుకోవడానికి కేసు విచారిస్తున్నట్లు మధ్యప్రదేశ్ ఆర్థక విభాగం అధికారి ఒకరు తెలిపారు.
కాగా, శ్రీవాస్తవ ఈ కేసుకు సంబంధంచి మొదటిసారి 2014, మార్చి 26న ఫిర్యాదు చేశాడని, అప్పుడు దర్యాప్తు పూర్తి చేసి 2018లో కేసు మూసివేసినట్లు సదరు ఈవోడబ్ల్యూ అధికారి తెలిపారు. అయితే తాజాగా మరోసారి శ్రీవాస్తవ అదే భూవ్యవహారంపై ఫిర్యాదు చేయడంతో రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. సింధియా కాంగ్రెస్‌ను వీడడంతో అతనిపై కమల్‌నాథ్ సర్కార్ కక్షసాధిస్తోందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.
tag; jyotiraditya scindia, land sale case, national news