RGV: ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా
సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో దర్శకుడు రాంగోపాల్ వర్మ(Director Ram Gopal Varma) దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను(Bail Petitions) హైకోర్టు వాయిదా(Postponed) వేసింది.
దిశ, వెబ్ డెస్క్: సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో దర్శకుడు రాంగోపాల్ వర్మ(Director Ram Gopal Varma) దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను(Bail Petitions) హైకోర్టు వాయిదా(Postponed) వేసింది. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ(RGV) సీఎం చంద్రబాబు(CM Chandrababu), మంత్రి నారా లోకేష్(Lokesh Nara) పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని ఆంధ్రప్రదేశ్ లోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఏపీ పోలీసులు(AP Police) రెండు సార్లు నోటీసులు(Notices) జారీ చేసినా విచారణకు హాజరు కాకపోవడంతో ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు చర్యలు చేపట్టారు. దీంతో ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోరుటూ ఏపీ హైకోర్టు(AP high Court)ను ఆశ్రయించారు. దీనిపై ఇవాళ విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఆర్జీవీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను వాయిదా వేసింది. ఆర్జీవి పిటిషన్లను రేపు విచారించనున్నట్లు హైకోర్టు తెలిపింది. దీంతో ఆర్జీవీ దాఖలు చేసిన పిటిషన్లు హైకోర్టులో బుధవారం విచారణకు రానున్నాయి.