Pawan Kalyan: కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో భేటీ.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ (Deputy CM Pawan Kalyan) ఢిల్లీ (Delhi) పర్యటనలో ఉన్నారు.

Update: 2024-11-26 06:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ (Deputy CM Pawan Kalyan) ఢిల్లీ (Delhi) పర్యటనలో ఉన్నారు. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్ర మంత్రుల భేటీతో అక్కడే బిజీబిజీగా గడపనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా.. ఆయన రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, ఇతర అంశాలపై చర్చించేందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ (Union Minister Gajendra Singh Shekavath)ను కలిశారు. భేటీ అనంతరం పవన్ కళ్యాన్ (Pavan Kalyan) మాట్లాడుతూ.. పర్యాటక రంగంలోని మొత్తం 7 ప్రాజెక్టులపై కేంద్ర మంత్రికి ప్రతిపాదనలను అందజేశామని పేర్కొన్నారు. పర్యాటక విశ్వవిద్యాలయం (Tourism University) ఏర్పాటు చేయాలని కోరామని.. అందుకు గజేంద్ర సింగ్ షెకావత్‌‌ (Gajendra Singh Shekavath) కూడా సానుకూలంగా స్పందించారని పవన్ కళ్యాణ్ తెలిపారు. అదేవిధంగా ఇవాళ ఆయన సాయంత్రం 3.15‌కు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Seetharaman)ను కలవనున్నారు. సాయంత్రం 4.30కి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnav), సాయంత్రం 5.15కు ఫిషరీస్, పాడి, పశు సంవర్ధక శాఖ మంత్రి లాలన్‌సింగ్‌‌ (Laalan Singh)తో పవన్ భేటీ కానున్నారు.   

Tags:    

Similar News