పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాది ఏప్రిల్ 30 నాటికి భారత విదేశీ మారక నిల్వలు రూ. 29.1 వేల కోట్లు పెరిగి రూ. 43.8 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆర్‌బీఐ శుక్రవారం వెల్లడించింది. 2021, జనవరి 29 నాటికి విదేశీ మారక నిల్వలు జీవితకాల గరిష్ఠ స్థాయి రూ. 43.9 లక్షల కోట్లను తాకింది. ఏప్రిల్ చివరి నాటికి మొత్తం నిల్వల్లో ప్రధానమైన విదేశీ కరెన్సీ ఆస్తుల(ఎఫ్‌సీఏ) పెరుగుదల కారణంగా మారక నిల్వల్లో వృద్ధి నమోదైనట్టు ఆర్‌బీఐ […]

Update: 2021-05-07 10:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాది ఏప్రిల్ 30 నాటికి భారత విదేశీ మారక నిల్వలు రూ. 29.1 వేల కోట్లు పెరిగి రూ. 43.8 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆర్‌బీఐ శుక్రవారం వెల్లడించింది. 2021, జనవరి 29 నాటికి విదేశీ మారక నిల్వలు జీవితకాల గరిష్ఠ స్థాయి రూ. 43.9 లక్షల కోట్లను తాకింది. ఏప్రిల్ చివరి నాటికి మొత్తం నిల్వల్లో ప్రధానమైన విదేశీ కరెన్సీ ఆస్తుల(ఎఫ్‌సీఏ) పెరుగుదల కారణంగా మారక నిల్వల్లో వృద్ధి నమోదైనట్టు ఆర్‌బీఐ గణాంకాలు తెలిపాయి. ఇక, బంగారం నిల్వలు దాదాపు రూ. 3,770 కోట్లు తగ్గి రూ. 2.64 లక్షల కోట్లకు చేరుకున్నాయని గణాంకాలు వెల్లడించాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) వద్ద భారత్‌ స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ రూ. 22.3 కోట్లు పెరిగి రూ. 11.2 వేల కోట్లకు చేరుకున్నాయి. అలాగే, ఐఎంఎఫ్‌ వద్ద భారత్‌ నిల్వలు రూ. 14.9 కోట్లు పెరిగి రూ. 37.1 వేల కోట్లకు చేరుకున్నట్టు ఆర్‌బీఐ గణాంకాలు వెల్లడించాయి.

Tags:    

Similar News