టెన్షన్ టెన్షన్.. అక్కడ 32పెద్దపులి పాదముద్రలు
దిశ, వెబ్‌డెస్క్ : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం అందర్నీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. రాత్రుళ్లు పశువులపై దాడి చేసి చంపేస్తోందని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మొన్నిమధ్యే ఓ పశువుల కాపరిపై పెద్దపులి దాడి చేసి చంపేడమే కాకుండా, అడవిలోకి లాక్కెళ్లింది. దీంతో జిల్లా వాసులు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఎటు నుంచి వచ్చి పులి పంజా విసురుతుందోనని రేయిబవళ్లు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే మనిషిని తిన్నపెద్దపులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. […]
దిశ, వెబ్‌డెస్క్ : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం అందర్నీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. రాత్రుళ్లు పశువులపై దాడి చేసి చంపేస్తోందని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మొన్నిమధ్యే ఓ పశువుల కాపరిపై పెద్దపులి దాడి చేసి చంపేడమే కాకుండా, అడవిలోకి లాక్కెళ్లింది. దీంతో జిల్లా వాసులు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఎటు నుంచి వచ్చి పులి పంజా విసురుతుందోనని రేయిబవళ్లు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
ఈ నేపథ్యంలోనే మనిషిని తిన్నపెద్దపులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. జిల్లాలోని బెజ్జూర్, పెంచికల్ పేట, దిగడ, వేమనపల్లిలో 300లకు పైగా ట్రాప్ కెమెరాలను అమర్చారు.అక్కడక్కడా పులిబోన్లను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ మూడు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు. ఎలాగైనా పులిని బంధించేందుకు 250మంది అటవీ, పోలీసు సిబ్బందితో నిరంతరం పహారా కాస్తున్నారు. పులి సంచరించిన ప్రాంతాల్లో 32 కాలి ముద్రలను అధికారులు గుర్తించారు. ఇదిలాఉండగా, శుక్రవారం సాయంత్రం పొలం పనులకు వెళ్లి వస్తున్న కూలీలకు పెద్దపులి కనిపించిందని వారు అధికారులకు చెప్పారు. దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సెర్చ్ కొనసాగుతోంది. కాగా, వీలైనంత త్వరగా పెద్దపులిని బంధించి తమను, పశువులను కాపాడాలని కొమరంభీం ప్రజలు కోరుతున్నారు.