శ్రీలంక ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీలకు షాక్
దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంక దేశీయ లీగ్ అయిన SLPL(Sri Lanka Premier League)కు ఊహించని షాక్ తగిలింది. సాధారణంగా ఇటువంటి లీగ్‌లల్లో విదేశీ స్టార్ ఆటగాళ్లను ఆడిస్తూ మ్యాచ్‌లను మలుపు తిప్పే జట్లకు టోర్నీ మొదలుకాకముందే ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఆయా జట్ల ఫ్రాంచైజీలకు తలలు పట్టుకునేలా చేసింది. ఇంతకీ ఏమైందనుకుంటున్నారా.. టీ-20 సీజన్‌ల్లో ఆరితేరిన డుప్లెసిస్, ఆండ్రీ రస్సెల్, డేవిడ్ మిల్లర్, మన్విందర్ బిస్లా వంటి ఆటగాళ్లు SLPL నుంచి వైదొలిగారు. సఫారీల జాతీయ జట్టులో […]
దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంక దేశీయ లీగ్ అయిన SLPL(Sri Lanka Premier League)కు ఊహించని షాక్ తగిలింది. సాధారణంగా ఇటువంటి లీగ్‌లల్లో విదేశీ స్టార్ ఆటగాళ్లను ఆడిస్తూ మ్యాచ్‌లను మలుపు తిప్పే జట్లకు టోర్నీ మొదలుకాకముందే ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఆయా జట్ల ఫ్రాంచైజీలకు తలలు పట్టుకునేలా చేసింది. ఇంతకీ ఏమైందనుకుంటున్నారా.. టీ-20 సీజన్‌ల్లో ఆరితేరిన డుప్లెసిస్, ఆండ్రీ రస్సెల్, డేవిడ్ మిల్లర్, మన్విందర్ బిస్లా వంటి ఆటగాళ్లు SLPL నుంచి వైదొలిగారు.
సఫారీల జాతీయ జట్టులో సమిష్టిగా రాణిస్తున్న మిల్లర్, డేవిడ్ మలన్, డుప్లెసిస్.. ఇంగ్లాండ్‌తో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్ కారణంగా SLPL ఆడలేమని స్పష్టం చేశారు. దీనికి తోడు ప్రస్తుత ఐపీఎల్‌లో పేలవ ఫామ్ కొనసాగిస్తున్న హార్డ్ హిట్టర్ ఆండ్రూ రస్సెల్ కూడా మోకాలి గాయం కారణంగా లీగ్‌కు దూరం అయ్యాడు. అంతేకాకుండా.. శ్రీలంక టోర్నీలో భారత ఆటగాళ్లు కూడా ఆడరని బీసీసీఐ నిర్ణయంతో భారత వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ మన్విందర్ బిస్లా కూడా SLPL నుంచి తప్పుకున్నాడు. ఈ ఆటగాళ్ల పై భారీ అంచనాలతో ఆయా జట్లలోకి తీసుకున్న ఫ్రాంచైజీలకు ఎదురుదెబ్బ తాకిందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.