నిబంధనలు బేఖాతరు.. ఆసుపత్రులకు రూ. 15 లక్షలు జరిమానా

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న వేళ కొవిడ్ నిబంధనలు పాటించని ఆసుపత్రులకు అధికారులు భారీగా జరిమానా విధించారు. విజయవాడలోని నాలుగు ఆసుపత్రులకు కలిపి రూ. 15 లక్షలు జరిమానా వేశారు. నగరంలోని సన్‌రైజ్ ఆసుపత్రికి రూ. 9 లక్షలు, ప్రజ్ఞ ఆసుపత్రి, లిబర్టీ ఆసుపత్రికి రూ. 2 లక్షలు, నూజివీడు వెంకటేశ్వర ఆసుపత్రికి రూ. 3 లక్షలు జరిమానా విధించారు. కరోనా నిబంధనలు పాటించకపోతే ఆసుపత్రుల లైసెన్స్‌లు రద్దు చేస్తామని జాయింట్ కలెక్టర్ […]

Update: 2021-05-03 10:57 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న వేళ కొవిడ్ నిబంధనలు పాటించని ఆసుపత్రులకు అధికారులు భారీగా జరిమానా విధించారు. విజయవాడలోని నాలుగు ఆసుపత్రులకు కలిపి రూ. 15 లక్షలు జరిమానా వేశారు. నగరంలోని సన్‌రైజ్ ఆసుపత్రికి రూ. 9 లక్షలు, ప్రజ్ఞ ఆసుపత్రి, లిబర్టీ ఆసుపత్రికి రూ. 2 లక్షలు, నూజివీడు వెంకటేశ్వర ఆసుపత్రికి రూ. 3 లక్షలు జరిమానా విధించారు. కరోనా నిబంధనలు పాటించకపోతే ఆసుపత్రుల లైసెన్స్‌లు రద్దు చేస్తామని జాయింట్ కలెక్టర్ శివశంకర్ హెచ్చరించారు.

 

Tags:    

Similar News