అరవమంటున్న ఐస్‌ల్యాండ్..ఎందుకంటే?

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు టూరిజం రంగం దారుణంగా దెబ్బతిన్నది. దీనివల్ల టూరిజం ప్రధాన ఆదాయవనరుగా బతికే ద్వీపదేశాలన్నీ ఆర్థిక సంక్షోభానికి వచ్చే పరిస్థితి ఏర్పడింది. అందుకే కష్టనష్టాలు పడుతూ ఎలాగోలా వైరస్‌ను తమ దేశాల్లోనుంచి తరిమేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇక తమ వల్ల కాదని తెలిసి, కఠిన నిబంధనలు పాటిస్తూ మళ్లీ పర్యాటక ప్రదేశాలను తెరిచే ప్రయత్నం చేస్తున్నారు. తెరిస్తే తెరిచారు కానీ, ముందు అక్కడికి సందర్శకులు రావాలి కదా? ముఖ్యంగా విదేశీ సందర్శకులతోనే ఎక్కువ ఆదాయం […]

Update: 2020-07-17 06:08 GMT

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు టూరిజం రంగం దారుణంగా దెబ్బతిన్నది. దీనివల్ల టూరిజం ప్రధాన ఆదాయవనరుగా బతికే ద్వీపదేశాలన్నీ ఆర్థిక సంక్షోభానికి వచ్చే పరిస్థితి ఏర్పడింది. అందుకే కష్టనష్టాలు పడుతూ ఎలాగోలా వైరస్‌ను తమ దేశాల్లోనుంచి తరిమేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇక తమ వల్ల కాదని తెలిసి, కఠిన నిబంధనలు పాటిస్తూ మళ్లీ పర్యాటక ప్రదేశాలను తెరిచే ప్రయత్నం చేస్తున్నారు. తెరిస్తే తెరిచారు కానీ, ముందు అక్కడికి సందర్శకులు రావాలి కదా? ముఖ్యంగా విదేశీ సందర్శకులతోనే ఎక్కువ ఆదాయం వస్తుంది. కొవిడ్ వంటి భయానక పరిస్థితుల్లో టూరిస్టులను ఆకర్షించడం ఎలా? అందుకు ఐస్‌ల్యాండ్ దేశం ఒక వినూత్న ఉపాయాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అదేంటంటే…

లాక్‌డౌన్ కారణంగా ఎంతో మంది ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద్యోగం పోయి, డబ్బులు లేక, పనులు జరగక నానా ఇబ్బందులు పడ్డారు. ఎవరికైనా చెప్పుకుని బాధ తగ్గించుకుందామా అంటే అందరిదీ అదే పరిస్థితీ..అవకాశం వస్తే ఎక్కడికైనా గట్టిగా బాధ, చిరాకు, కోపం అన్ని బయటపడేలా అరవాలని అనిపించే పరిస్థితి. అవును… కచ్చితంగా అదే అవకాశాన్ని ఇప్పుడు ఐస్‌ల్యాండ్ టూరిజం కల్పిస్తోంది. ఆ దేశంలోని ప్రధాన పర్యాటక స్థలాల్లో పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టి అరుపులను వినిపిస్తోంది. అంతేకాదు..మీరు కూడా వచ్చి గట్టిగా అరవండి అని విదేశీ సందర్శకులను ఆహ్వానిస్తోంది. దీని గురించి యూట్యూబ్‌లో ఒక ప్రోమోను కూడా విడుదల చేసింది. ఇక ఆలస్యమెందుకు… ఐస్‌ల్యాండ్ వెళ్లండి మరి, అంత బడ్జెట్ లేకపోతే జెర్సీ సినిమాలో నాని లాగా రైలు వెళ్తున్నపుడు గట్టిగా అరవండి. ఎలాగోలా ఫ్రస్ట్రేషన్ తీర్చేసుకోండి, అంతేగానీ దాన్ని మన ఆత్మీయుల మీద చూపించి బంధాలు పాడుచేసుకోకండి.

Tags:    

Similar News