‘అంతా విప్పి చూపిస్తా’ అంటూ వీడియో కాల్.. ఆ తరువాత..

దిశ, వెబ్‌డెస్క్: రోజురోజుకు మోసాలు చేయడంలో కొత్తకొత్త పంథాలను ఎంచుకుంటున్నారు కొందరు. ఈజీ మనీకి అలవాటు పడి చెడుదారుల్లో డబ్బులు సంపాదించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాంటి ఘటనే ఇది. కరోనా కాలంలో డబ్బు సంపాదించేందుకు అవకాశాలు రాకపోవడంతో బతుకుబండి లాగటం కష్టమైన యువతులు, మహిళలను టార్గెట్ చేస్తున్నారు. వారి అవకాశాన్ని ఆసరాగా చేసుకొని మరొకరితో చాటింగ్, వీడియో కాల్ చేయిస్తూ బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు ఆరెస్టు చేశారు. ఓ యువతి వలపు మాటలతో […]

Update: 2021-08-23 07:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: రోజురోజుకు మోసాలు చేయడంలో కొత్తకొత్త పంథాలను ఎంచుకుంటున్నారు కొందరు. ఈజీ మనీకి అలవాటు పడి చెడుదారుల్లో డబ్బులు సంపాదించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాంటి ఘటనే ఇది. కరోనా కాలంలో డబ్బు సంపాదించేందుకు అవకాశాలు రాకపోవడంతో బతుకుబండి లాగటం కష్టమైన యువతులు, మహిళలను టార్గెట్ చేస్తున్నారు. వారి అవకాశాన్ని ఆసరాగా చేసుకొని మరొకరితో చాటింగ్, వీడియో కాల్ చేయిస్తూ బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు ఆరెస్టు చేశారు. ఓ యువతి వలపు మాటలతో యువకుడికి కైపెక్కించి, నమ్మకం కుదిరాక న్యూడ్ కాల్ చేస్తా.. అంతా విప్పి చూపిస్తా అంటూ.. వలలో పడేసింది.

ఆమె వీడియో కాల్ చేస్తుండగా సదరు యువకుడితో సైతం బట్టలు విప్పించి రికార్డ్ చేసింది. ఇదిలా ఉంటే.. మరో మహిళ ఓ యువకుడితో చాటింగ్, ఆడియో కాల్ చేస్తూ మత్తెక్కించే మాటలతో బుట్టలో వేసుకుంది. అతడి అర్థనగ్న ఫోటోలు సేకరించింది. దీంతో రంగంలోకి ముఠా సభ్యులు దిగి సదరు యువకుడిని బ్లాక్ మెయిల్ చేసి అందిన కాడికి దండుకున్నారు. అయినప్పటికీ వారి వేధింపులు తాళలేక సదరు యువకుడు కర్నూల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులకు నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐదుగురు ముఠా హనీట్రాప్‌కు పాల్పడుతూ ఎంతోమంది నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రూ.4లక్షలు విలువైన 2 చెక్కులతో పాటు మరో రూ.4లక్షల విలువైన 2 ప్రాంసరినోట్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ తెలిపారు.

Tags:    

Similar News