భారీ వర్షాలు, నిర్మల్ రోడ్లపై చేపలు.. వీడియో వైరల్

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలం అవుతోంది. ముఖ్యంగా నిర్మల్‌లో అధిక వర్షాపాతం నమోదు అయింది. ఈ ప్రభావంతో ఉమ్మడి జిల్లాలోని ప్రధాన జలాశయాలకు భారీగా వరద పోటెత్తడంతో ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. పల్లె పట్టణం తేడా లేకుండా ప్రధాన వీధులు శివారు ప్రాంతాలు జలమయంగా మారాయి. ఈ క్రమంలోనే వరదలకు నిర్మల్ రోడ్ల మీదకు చేపలు వచ్చి చేరాయి. ఇది గమనించిన పలువురు […]

Update: 2021-07-22 01:18 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలం అవుతోంది. ముఖ్యంగా నిర్మల్‌లో అధిక వర్షాపాతం నమోదు అయింది. ఈ ప్రభావంతో ఉమ్మడి జిల్లాలోని ప్రధాన జలాశయాలకు భారీగా వరద పోటెత్తడంతో ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. పల్లె పట్టణం తేడా లేకుండా ప్రధాన వీధులు శివారు ప్రాంతాలు జలమయంగా మారాయి. ఈ క్రమంలోనే వరదలకు నిర్మల్ రోడ్ల మీదకు చేపలు వచ్చి చేరాయి. ఇది గమనించిన పలువురు స్థానికులు వాటిని పట్టేందుకు ఆసక్తి చూపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

Full View

More interesting News: వింత చేపల కథ.. నీళ్లలోనే కాదు కొండలు, గుట్టలు ఎక్కేయగలవు

Follow Disha official Facebook page: https://www.facebook.com/dishatelugunews

 

Tags:    

Similar News