చరిత్రలో మొదటిసారి.. మంచుపై దిగిన ఎయిర్ బస్..
దిశ, ఫీచర్స్ :190 టన్నుల బరువున్న ఎయిర్‌బస్ A340 ప్యాసింజర్ విమానం అంటార్కిటికా ఖండంలో మంచుతో తయారు చేసిన రన్‌వేపై ల్యాండ్ అయిన మొదటి ఎయిర్ బస్‌గా నిలిచింది. 1990 నుంచి ఎయిర్‌బస్ A340 గగనతలంలో విహరిస్తున్నప్పటికీ ఇప్పటివరకు అక్కడ ల్యాండ్ కాలేదు. తాజాగా అంటార్కిటికాలోని మంచు ప్రాంతంలో మొదటిసారి విజయవంతంగా దిగిన ఎయిర్‌క్రాఫ్ట్‌గా చరిత్ర సృష్టించింది. అయితే సదరు విమానంతో పాటు కెప్టెన్ వివరాలు ఆలస్యంగా వెలుగుచూశాయి. ఈ నెల 2వ తేదీన, దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ […]
దిశ, ఫీచర్స్ :190 టన్నుల బరువున్న ఎయిర్‌బస్ A340 ప్యాసింజర్ విమానం అంటార్కిటికా ఖండంలో మంచుతో తయారు చేసిన రన్‌వేపై ల్యాండ్ అయిన మొదటి ఎయిర్ బస్‌గా నిలిచింది. 1990 నుంచి ఎయిర్‌బస్ A340 గగనతలంలో విహరిస్తున్నప్పటికీ ఇప్పటివరకు అక్కడ ల్యాండ్ కాలేదు. తాజాగా అంటార్కిటికాలోని మంచు ప్రాంతంలో మొదటిసారి విజయవంతంగా దిగిన ఎయిర్‌క్రాఫ్ట్‌గా చరిత్ర సృష్టించింది. అయితే సదరు విమానంతో పాటు కెప్టెన్ వివరాలు ఆలస్యంగా వెలుగుచూశాయి.
ఈ నెల 2వ తేదీన, దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన A340 విమానం అంటార్కిటికాలోని ‘వోల్ఫ్స్ ఫాంగ్’ రన్‌వేపై దిగింది. ఇది బ్లూ గ్లేసియల్ మంచుతో తయారు చేయబడిన ఎయిర్‌స్ట్రిప్. శ్వేత ఖండంలో దిగిన మొదటి భారీ ప్యాసింజర్ విమానం(ఎయిర్‌బస్ A340) ఇదే కాగా.. గరిష్టంగా 275 టన్నుల టేకాఫ్ బరువుతో అంటార్కిటికాలో దిగిన అత్యంత బరువైన విమానాల్లో ఒకటిగా నిలిచింది. పోర్చుగల్‌లోని లిస్బన్‌కు చెందిన హై ఫ్లై ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్ కంపెనీ కాలర్ ఈ విమానాన్ని నడిపింది. ఈ ఫ్లైట్ వీడియోను ఆపరేటర్ యూట్యూబ్‌లో షేర్ చేయగా.. కాక్‌పిట్ లోపల నుంచి ల్యాండింగ్ మూమెంట్స్‌ను ఇందులో చూడవచ్చు. ఈ ‘వోల్ఫ్ ఫాంగ్ రన్‌వే’ను 60 మీటర్ల వెడల్పుతో 3 కిలోమీటర్ల పొడవున నిర్మించారు. మందమైన, గాలి చొరబడని మంచు పొరతో 1.4 కిలోమీటర్ల లోతు నుంచి ఈ రన్‌వే రూపొందించారు.
ఫ్లైట్-ట్రాకింగ్ సర్వీస్ RadarBox.com ప్రకారం.. ఎయిర్‌బస్ A340 నవంబర్ 1- 4 తేదీల మధ్య కేప్ టౌన్ నుంచి అంటార్కిటికాకు వచ్చి వెళ్లింది. విమానంలో 23 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ‘హై ఫ్లై’ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ కెప్టెన్ కార్లోస్ మిర్పురి 4,630 కిలోమీటర్ల ప్రయాణాన్ని 5 గంటల్లో పూర్తి చేశారు. ఈ చారిత్రాత్మక విజయం.. భవిష్యత్‌లో ప్రయాణీకులు పెద్ద జెట్ విమానాల్లో అంటార్కిటికాకు ప్రయాణించేందుకు, అక్కడ పర్యాటక కార్యకలాపాల కోసం మార్గం సుగమం చేస్తోంది. కాగా అంటార్కిటికాలో అధికారిక విమానాశ్రయం లేదు కానీ 50 ల్యాండింగ్ స్ట్రిప్స్, రన్‌వేలు మాత్రం ఉన్నాయి.