ఒకరి లాభం.. మరొకరి నష్టం
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ 19 నుంచి రికవరీ అయిన పేషెంట్లకు ఇప్పుడు రానున్న దీపావళి, పెరుగుతున్న చలి.. గట్టిగా చెప్పాలంటే రానున్న చలికాలాన్ని గురించి తలచుకుంటేనే వెన్నులో వణుకుపుడుతోంది. కొవిడ్ 19తో పోరాడి గెలిచారు కానీ గాలి కాలుష్యంతో పోరాడేంత ఇమ్యూనిటీ వాళ్ల దగ్గర లేకపోవడమే ఇందుకు కారణం. అదృష్టవశాత్తు ఇదే విషయాన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అర్థం చేసుకున్నాయి. అందుకే కొవిడ్ 19 పేషెంట్ల కోసం, అలాగే రికవరీ అయిన వారి కోసం ఒక్కొక్క రాష్ట్రం […]
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ 19 నుంచి రికవరీ అయిన పేషెంట్లకు ఇప్పుడు రానున్న దీపావళి, పెరుగుతున్న చలి.. గట్టిగా చెప్పాలంటే రానున్న చలికాలాన్ని గురించి తలచుకుంటేనే వెన్నులో వణుకుపుడుతోంది. కొవిడ్ 19తో పోరాడి గెలిచారు కానీ గాలి కాలుష్యంతో పోరాడేంత ఇమ్యూనిటీ వాళ్ల దగ్గర లేకపోవడమే ఇందుకు కారణం. అదృష్టవశాత్తు ఇదే విషయాన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అర్థం చేసుకున్నాయి. అందుకే కొవిడ్ 19 పేషెంట్ల కోసం, అలాగే రికవరీ అయిన వారి కోసం ఒక్కొక్క రాష్ట్రం ఈ దీపావళికి బాణసంచా కాల్చడం మీద నిషేధం విధిస్తున్నాయి. అయితే ఈ నిషేధం వల్ల తమిళనాడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రభావితమయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటికే ఒడిశా, కర్ణాటక, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్, సిక్కిం రాష్ట్రాలు బాణసంచా అమ్మడం, కొనడం, కాల్చడం మీద నిషేధం విధించాయి. అయితే టపాసులు అనగానే మొదట గుర్తొచ్చే ‘శివకాశి’ ఇప్పుడు నష్టపోబోతోంది. సంవత్సరమంతా టపాసుల తయారీలో నిమగ్నమై దీపావళికి దేశవ్యాప్తంగా భారీగా బిజినెస్ చేసి లాభాలు గడించే శివకాశి టపాసుల సంస్థలు, కార్మికులకు ఇది పెద్ద ఆర్థిక సమస్యగా మారనుంది. అసలే లాక్‌డౌన్ కారణంగా ఆర్థికంగా నష్టపోయిన ఈ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. దీని గురించి ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా బాణసంచా నిషేధం విధించవద్దని ఇతర రాష్ట్రాలను కోరుతోంది. ఇలాంటి సందర్భంలో అటు ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలా? లేదా ఆర్థికంగా కుంటుపడబోయే కుటుంబాలకు ప్రాముఖ్యత ఇవ్వాలా? అనే సందిగ్ధం ఏర్పడింది. ఏదేమైనా మీ చుట్టుపక్కల గనక కొవిడ్ 19 పేషెంట్లు లేదా రికవరీ అయిన వాళ్లు ఉంటే, వారి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని క్రాకర్స్ కాల్చకపోవడమే మంచిదనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఎలాంటి జబ్బునైనా భరించవచ్చు గానీ శ్వాసలో ఇబ్బందులు ఎదురైతే మాత్రం అటు బతకలేక, ఇటు చావలేక నరకం కనిపించే పరిస్థితి ఉంటుంది, గాలి కాలుష్యం ఈ పరిస్థితిని మరింత దారుణంగా మారుస్తుంది. కాబట్టి దిస్ దివాళి.. బ్యాన్ క్రాకర్స్!