కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

దిశ, వెబ్‌డెస్క్ : గుజరాత్ రాష్ర్టం, భరూచ్ జిల్లాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ఝగడియాలోని జీఐడీసీ కెమికల్ ఫ్యాక్టరీలోని యూపీఎల్-5 ప్లాంట్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. దీని శబ్ధం సుమారు 15 కిలో మీటర్ల దూరం వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. మొదట భూకంపం వచ్చిందని భావించిన ప్రజలు భారీగా అగ్నికీలలు ఎగిసిపడడం, కిలోమీటర్ల మేర దట్టమైన పొగ కమ్ముకోవడంతో ప్రమాదం జరిగిందని గుర్తించారు. ఈ ప్రమాదంలో 24 […]

Update: 2021-02-22 22:35 GMT

దిశ, వెబ్‌డెస్క్ : గుజరాత్ రాష్ర్టం, భరూచ్ జిల్లాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ఝగడియాలోని జీఐడీసీ కెమికల్ ఫ్యాక్టరీలోని యూపీఎల్-5 ప్లాంట్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. దీని శబ్ధం సుమారు 15 కిలో మీటర్ల దూరం వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. మొదట భూకంపం వచ్చిందని భావించిన ప్రజలు భారీగా అగ్నికీలలు ఎగిసిపడడం, కిలోమీటర్ల మేర దట్టమైన పొగ కమ్ముకోవడంతో ప్రమాదం జరిగిందని గుర్తించారు.

ఈ ప్రమాదంలో 24 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పేలుడు ధాటికి సమీప గ్రామాల్లోని ఇళ్ల కిటికీల అద్దాలు పగిలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపకదళం మంటలను అదుపు చేస్తోంది. ఫ్యాక్టరీలో ఉన్న సిబ్బందిని బయటకు తీసుకువస్తోంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News