బీ అలర్ట్: మాస్క్ లేకపోతే రూ.2 వేలు ఫైన్
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాప్తి మళ్లీ తీవ్రతరం అవుతున్న క్రమంలో కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. కోవిడ్ నిబంధనలను మళ్లీ కఠినతరం చేస్తున్నాయి. మాస్కు ధరించని వారికి అధికారులు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో మాస్కు ధరించనివారికి అధికారులు భారీగా జరిమానా విధించారు. ఏకంగా రూ.2 వేలు జరిమానా విధించడంతో ప్రజలు షాక్‌కు గురయ్యారు. రోడ్డుపై మాస్కు ధరించనివారికి రూ. వెయ్యి ఫైన్ వేస్తున్నారు. ఇక మాస్కులు లేని కస్టమర్లను షాపులోకి అనుమతిస్తే షాపు […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాప్తి మళ్లీ తీవ్రతరం అవుతున్న క్రమంలో కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. కోవిడ్ నిబంధనలను మళ్లీ కఠినతరం చేస్తున్నాయి. మాస్కు ధరించని వారికి అధికారులు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో మాస్కు ధరించనివారికి అధికారులు భారీగా జరిమానా విధించారు. ఏకంగా రూ.2 వేలు జరిమానా విధించడంతో ప్రజలు షాక్‌కు గురయ్యారు.
రోడ్డుపై మాస్కు ధరించనివారికి రూ. వెయ్యి ఫైన్ వేస్తున్నారు. ఇక మాస్కులు లేని కస్టమర్లను షాపులోకి అనుమతిస్తే షాపు యజమాన్యానికి రూ.2 వేలు ఫైన్ విధిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని ఫతేనగర్‌లో మాస్కులు లేకుండా కస్టమర్లకు అనుమతించినందుకు ఒక స్టీల్ షాపు యజమానికి జీహెచ్‌ఎంసీ అధికారులు రూ.2 వేలు ఫైన్ వేశారు. ప్రజలు, షాపు యజమానులు కరోనా రూల్స్ పాటించకపోతే భారీ జరిమానాలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.