టీమిండియాకు మళ్లీ జరిమానా

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియాకు మళ్లీ జరిమానా పడింది. ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియాకు మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ జరిమానా విధించారు. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించినట్లు ఆయన తెలిపారు. నిర్ణీత సమయానికి ఒక ఓవర్ తక్కువగా వేసినట్లు గుర్తించినట్లు రిఫరీ జవగళ్ శ్రీనాథ్ తెలిపారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ తప్పిదాన్ని ఒప్పుకోవడంతో జరిమానాతో సరిపెట్టామన్నారు. కాగా టీమిండియా స్లో ఓవర్ రేట్ […]

Update: 2021-03-15 11:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియాకు మళ్లీ జరిమానా పడింది. ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియాకు మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ జరిమానా విధించారు. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించినట్లు ఆయన తెలిపారు.

నిర్ణీత సమయానికి ఒక ఓవర్ తక్కువగా వేసినట్లు గుర్తించినట్లు రిఫరీ జవగళ్ శ్రీనాథ్ తెలిపారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ తప్పిదాన్ని ఒప్పుకోవడంతో జరిమానాతో సరిపెట్టామన్నారు. కాగా టీమిండియా స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానాను ఎదుర్కొవడం ఇది తొలిసారి కాదు. గతంలో అనేకసార్లు ఇలాంటి జరిమానాను ఎదుర్కొంది.

Tags:    

Similar News