Nitish Kumar Reddy : నితీశ్ కుమార్ రెడ్డిపై సువాస్కర్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు
దేవుడిని ప్రార్థించినా.. నితీశ్ కుమార్ రెడ్డి క్రికెటర్ బ్రెయిన్ అలానే ఉంది అని సునీల్ గవాస్కర్ అన్నాడు.
దిశ, స్పోర్ట్స్ : పరిస్థితులకు తగ్గట్లుగా ఆడగలనని నితీశ్ కుమార్ రెడ్డి నిరూపించుకున్నాడని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నాడు. మ్యాచ్ అనంతరం ఆయన ఓ ఛానెల్‌లో మాట్లాడారు. ‘పరిస్థితులకు తగ్గట్లుగా ఆడగలనని నితీశ్ నిరూపించుకున్నాడు. అతని షాట్ సెలక్షన్ అద్భుతంగా ఉంది. ఆఫ్ స్టంప్ అవతల పడిన బంతులను అతను వదిలేసిన విధానం, బాల్‌ను జడ్జ్ చేసిన తీరు ఆకట్టుకున్నాయి. ఫీల్డర్లు లేకున్నా.. నితీశ్ ర్యాంప్ షాట్లు ఆడేందుకు ప్రయత్నించలేదు. క్రికెట్‌ను యువకుడైన నితీశ్ తన భుజాలకెత్తుకున్నాడు. అది అలాగే ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నా..’ అని గవాస్కర్ అన్నాడు. నితీశ్ సెంచరీతో రాణించడంతో భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్‌తో కలిసి కీలక సమయంలో 127 పరుగుల భాగస్వామ్యాన్ని నితీశ్ నెలకొల్పాడు.