KTR:నితీష్ కుమార్ రెడ్డి ఫ్యూచర్‌లో కెప్టెన్ అవుతారు..!
బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుతం సృష్టించాడు.
దిశ,వెబ్‌డెస్క్: బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుతం సృష్టించాడు. నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) తన అంతర్జాతీయ టెస్టు కెరీర్‌లో మొదటి సెంచరీ(First century) నమోదు చేసి సత్తా చాటాడు. ఆస్ట్రేలియాతో ఈ బోర్డర్ గవాస్కర్ సిరీస్ తొలి టెస్టుతో అరంగేట్రం చేసిన 21 ఏళ్ల నితీష్ కుమార్ రెడ్డి మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో బాక్సింగ్ డే టెస్టులో 171 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో సెంచరీ మైలురాయిని చేరుకున్నాడు.
మొత్తంగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar series)లో విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ తర్వాత సెంచరీ చేసిన మూడో భారతీయ బ్యాటర్ గా నితీష్ కుమార్ రెడ్డి నిలిచాడు. దీంతో నితీష్ ఘన విజయం పై రాజకీయ ప్రముఖులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తరఫున సెంచరీ చేసిన నితీశ్ కుమార్ రెడ్డిని కేటీఆర్(KTR) అభినందించారు. టెర్రిఫిక్ ఇన్నింగ్స్ నితీశ్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఫ్యూచర్ కెప్టెన్ నితీష్ అంటూ ఆకాశానికి పొగిడారు.