గొర్రె దొంగల ముఠాగుట్టు రట్టు

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: గొర్రెలను దొంగతనం చేస్తున్న ముఠాగుట్టు రట్టు అయింది. ఈ ఘటన చేవెళ్ల మండల ముడిమ్యాల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముడిమ్యాల గ్రామానికి చెందిన గౌడిచెర్ల రవికి చెందిన గొర్రెల మంద నుంచి గొర్రెలు ఇటీవల మాయమవుతున్నాయి. ఆదివారం రాత్రి గొర్రెల యజమాని రవి తన కారులో ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో గొర్రెల మంద వద్దకు బయలుదేరిన సమయంలో గొర్రెలను ఇన్నోవా వాహనంలో రావులపెళ్లి గ్రామం వైపు తరిలిస్తున్నారు. దీంతో […]

Update: 2020-08-23 00:46 GMT

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: గొర్రెలను దొంగతనం చేస్తున్న ముఠాగుట్టు రట్టు అయింది. ఈ ఘటన చేవెళ్ల మండల ముడిమ్యాల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముడిమ్యాల గ్రామానికి చెందిన గౌడిచెర్ల రవికి చెందిన గొర్రెల మంద నుంచి గొర్రెలు ఇటీవల మాయమవుతున్నాయి. ఆదివారం రాత్రి గొర్రెల యజమాని రవి తన కారులో ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో గొర్రెల మంద వద్దకు బయలుదేరిన సమయంలో గొర్రెలను ఇన్నోవా వాహనంలో రావులపెళ్లి గ్రామం వైపు తరిలిస్తున్నారు. దీంతో రవి కారును చూసి దొంగలు పారిపోయేందుకు ప్రయత్నించారు.

మార్గమధ్యలో దొంగలు కారును వదిలి పరారయ్యారు. బాధితుడు రవి తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 17న 10 గొర్రెలు, 19న 12, 21వ తేదీన 10 మొత్తంగా 32 గొర్రెలను అపహరిచినట్లు తెలిపారు. అనంతరం బాధితుడు రవి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇన్నోవా కారును స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Tags:    

Similar News