ప్రభుత్వ వ్యాపార నిర్వహణలో ప్రైవేట్ బ్యాంకులకు అనుమతి

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ సంబంధిత పన్ను, పెన్షన్ చెల్లింపుల వంటి బ్యాంకింగ్ లావాదేవీలను అన్ని ప్రైవేట్ రంగ బ్యాంకులు నిర్వహించేందుకు అనుమతిస్తున్నట్టు బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. ప్రభుత్వ వ్యాపారాలను నిర్వహించేందుకు ప్రైవేట్ బ్యాంకులకు అనుమతిస్తున్నట్టు పేర్కొన్నారు. దీనివల్ల దేశ ఆర్థికవ్యవస్థ అభివృద్ధి, ప్రభుత్వ సామాజిక రంగ కార్యక్రమాల్లో ప్రైవేట్ బ్యాంకులు భాగస్వాములు కావొచ్చని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యాపారాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులే నిర్వహించాలనే నిబంధనను తొలగిస్తున్నట్టు, అన్ని బ్యాంకులూ […]

Update: 2021-02-24 09:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ సంబంధిత పన్ను, పెన్షన్ చెల్లింపుల వంటి బ్యాంకింగ్ లావాదేవీలను అన్ని ప్రైవేట్ రంగ బ్యాంకులు నిర్వహించేందుకు అనుమతిస్తున్నట్టు బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. ప్రభుత్వ వ్యాపారాలను నిర్వహించేందుకు ప్రైవేట్ బ్యాంకులకు అనుమతిస్తున్నట్టు పేర్కొన్నారు. దీనివల్ల దేశ ఆర్థికవ్యవస్థ అభివృద్ధి, ప్రభుత్వ సామాజిక రంగ కార్యక్రమాల్లో ప్రైవేట్ బ్యాంకులు భాగస్వాములు కావొచ్చని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యాపారాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులే నిర్వహించాలనే నిబంధనను తొలగిస్తున్నట్టు, అన్ని బ్యాంకులూ ప్రభుత్వ రంగ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని స్పష్టం చేశారు.

ప్రస్తుతం ప్రభుత్వ రంగానికి చెందిన పన్నులు, పెన్షన్‌ల చెల్లింపులు, ఇతర బ్యాంకింగ్ లావాదేవీలు ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్వహిస్తున్నాయి. తక్కువ సంఖ్యలో ప్రైవేట్ బ్యాంకులకు మాత్రమే అనుమతి ఉండేదని, నేటితో దీన్ని తొలగిస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా నిర్మలా సీతారామన్ తెలిపారు. కస్టమర్లకు మెరుగైన సౌలభ్యాన్ని అందించడమే కాకుండా పోటీని పెంచేందుకు ఈ నిర్ణయం వీలు కల్పిస్తుందన్నారు. ప్రైవేట్ బ్యాంకులు ఎప్పుడూ కొత్త తరహా బ్యాంకింగ్‌తో పాటు నూతన సాంకేతికతను అందుకుంటాయని ఆమె చెప్పారు. దీనికి సంబంధించి కేంద్రం నిర్ణయాన్ని ఆర్‌బీఐకి తెలియజేసినట్టు ఆమె వెల్లడించారు.

Tags:    

Similar News