కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆర్థిక మంత్రి ..

దిశ వెబ్ డెస్క్ : దేశంలో రెండో విడతలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 60ఏళ్ల వయస్సు పైబడిన వారికి, 45ఏళ్ల వయస్సు ఉండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. Got my first dose of the vaccination against COVID-19 this morning. Thanking sister Ramya PC, for her care […]

Update: 2021-03-04 06:01 GMT

దిశ వెబ్ డెస్క్ : దేశంలో రెండో విడతలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 60ఏళ్ల వయస్సు పైబడిన వారికి, 45ఏళ్ల వయస్సు ఉండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.

ఢిల్లీ వసంత కుంజ్‌లోని ఫోర్టిస్ ఆసుపత్రిలో ఆమె కోవిడ్‌ వ్యాక్సిన్‌ తొలి డోస్‌ను స్వీకరించారు. అనంతరం సీతారామన్‌ మాట్లాడుతూ.. భారతదేశంలో ఉండటం తన అదృష్టం ఇందుకు తనకు గర్వంగా ఉందంటూ అంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఎంతో నైపుణ్యంతో తనకు టీకా వేసిన నర్స్‌ రమ్యకు థ్యాంక్స్‌ చెప్పారు. వ్యాక్సిన్‌ అభివృద్ధి, పంపిణీ, సరైన సమయంలో, ప్రజలకు అందుబాటు ధరలో టీకా లభిస్తున్న దేశంలో పుట్టడం తన అదృష్టం అంటూ ట్వీట్‌ చేశారు. ఇప్పటికే భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు టీకా తీసుకున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News