హిందువులను తాలిబన్లతో పోల్చిన హీరోయిన్.. 12 జిల్లాల్లో కేసు నమోదు

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్ ను ఆఫ్గనిస్తాన్‌ పంపించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఎల్లప్పుడూ వివాదాలతోనే స్నేహం చేసే ఈ అమ్మడు మరోసారి వివాదంలో ఇరుక్కుంది. ఇటీవల తాలిబన్ల దాడి గురించి ట్వీట్ చేసిన స్వరా.. తన ట్వీట్ లో  ‘హిందూత్వ టెర్రరిజం’ అనే పదాన్ని  వాడి నెటిజన్ల ట్రోలింగ్ కి గురైంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు ఆమె హిందువుల మనోభావాలను దెబ్బ తీసిందని, ఫేమస్ అవ్వడం కోసం హిందుత్వాన్ని వాడుకుంటుందని […]

Update: 2021-08-20 00:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్ ను ఆఫ్గనిస్తాన్‌ పంపించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఎల్లప్పుడూ వివాదాలతోనే స్నేహం చేసే ఈ అమ్మడు మరోసారి వివాదంలో ఇరుక్కుంది. ఇటీవల తాలిబన్ల దాడి గురించి ట్వీట్ చేసిన స్వరా.. తన ట్వీట్ లో ‘హిందూత్వ టెర్రరిజం’ అనే పదాన్ని వాడి నెటిజన్ల ట్రోలింగ్ కి గురైంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు ఆమె హిందువుల మనోభావాలను దెబ్బ తీసిందని, ఫేమస్ అవ్వడం కోసం హిందుత్వాన్ని వాడుకుంటుందని మండిపడుతున్నారు.

స్వరా హిందుత్వ ఉగ్రవాదం గురించి మాట్లాడుతున్నది.. వెంటనే ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేసి, ట్విట్టర్ అకౌంట్ ని సస్పెండ్ చేయాలి లేదా ఆమెను ఆరునెలలు ఆఫ్గనిస్తాన్‌ పంపిస్తే.. తాలిబన్ల ఉగ్రవాదాన్ని రుచి చూస్తుంది.. దాంతో ఆమెకు రెండింటి మధ్య తేడా అర్థం అవుతుంది అంటూ ఫైర్ అవుతున్నారు. తాజాగా స్వరా భాస్కర్ పై ఉత్తరప్రదేశ్ లో కేసు నమోదు అయ్యింది. హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా మాట్లాడిందని బర్ఖా తెర్హాన్ సంఘం సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 12 జిల్లాల్లో ఆమెపై కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు.

“హిందూత్వ ఉగ్రవాదాన్ని మేం అంగీకరించలేదు.. అలానే తాలిబన్‌ల ఉగ్రవాదాన్ని చూసి అందరూ అవాక్కవుతున్నారు. అక్కడ వారి అరాచకం చూసినవారందరు షాక్ అవుతున్నారు. అలా షాక్ లో ఉండకండి.. ఇక్కడితోనే ఆగిపోకండి.. హిందూత్వ ఉగ్రవాదం గురించి అందరూ ఆగ్రహం వ్యక్తం చేయండి. మన మానవతా, నైతిక విలువలు అణచివేత, అణచివేతకు గురైన వారి గుర్తింపుపై ఆధారపడి ఉండకూడదు’’ అంటూ స్వరా ట్వీట్ చేసింది.

Tags:    

Similar News