కరోనాపై మా పోరాటం బాగుంది: బొత్స
కరోనా వ్యాప్తి నిరోధంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పోరాటం బాగుందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, పేద ప్రజలను ఆదుకునేందుకు ఈ నెల 1వ తేదీ నుంచి రేషన్ అందిస్తున్నామని అన్నారు. వారికి ఇంకా 1000 రూపాయలు ఇచ్చామని ఆయన అన్నారు. రేషన్ విషయంలో, 1000 రూపాయల పంపిణీ విషయంలో అక్కడక్కడ ఇబ్బందులు ఎదురయ్యాయని విన్నామని ఆయన చెప్పారు. అయితే ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే వారు వలంటీర్ల దృష్టికి తీసుకురావాలని […]
కరోనా వ్యాప్తి నిరోధంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పోరాటం బాగుందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, పేద ప్రజలను ఆదుకునేందుకు ఈ నెల 1వ తేదీ నుంచి రేషన్ అందిస్తున్నామని అన్నారు. వారికి ఇంకా 1000 రూపాయలు ఇచ్చామని ఆయన అన్నారు.
రేషన్ విషయంలో, 1000 రూపాయల పంపిణీ విషయంలో అక్కడక్కడ ఇబ్బందులు ఎదురయ్యాయని విన్నామని ఆయన చెప్పారు. అయితే ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే వారు వలంటీర్ల దృష్టికి తీసుకురావాలని అలా తెస్తే తాము వాటిని 24 గంటల వ్యవధిలో పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఇంతే కాకుండా పట్టణాల్లో చిక్కుకుపోయినవారితో పాటు అంతర్రాష్ట్ర కార్మికులు ఆకలి బాధలు పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు.
పట్టణాల్లో షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. వీటిల్లో ఎవరైనా రక్షణ పొందవచ్చని ఆయన తెలిపారు. అసంఘటిత కార్మికులతో పాటు విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు చిక్కుపోతే వారు ఈ షెల్టర్ హోమ్స్‌లో భోజనం చేయవచ్చని ఆయన తెలిపారు. కరోనా బయటపడి ప్రాంతాలను రెడ్ జోన్స్‌గా ప్రకటించామని ఆయన వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో క్లోరినేషన్ చేపట్టామని తెలిపారు.
Tags: botsa satyanarayana, munciple department, visakhapatanam, corona virus, fight againest corona