Ap News: చరిత్ర సృష్టించిన టీడీపీ

కార్యకర్తల సభ్యత్వ నమోదులో తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించింది..

Update: 2024-12-19 16:06 GMT

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) చరిత్ర సృష్టించింది. సభ్యత్వ నమోదులో ఏ పార్టీ అందుకోలేనంతగా దేశంలో కొత్త రికార్డు నెలకొల్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ 76 లక్షల 89 వేల 103 మంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అందరి భాగస్వామ్యంతో సాధ్యమైనట్లు పార్టీ భావిస్తోంది. దేశంలోనే కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టడంపై సీఎం చంద్రబాబు(CM Chandrababu) హర్షం వ్యక్తం చేశారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో నమ్మకం, విశ్వాసం బలంగా ఉందని, అందుకే సభ్యత్వ నమోదులో చరిత్ర సృష్టించామన్నారు. ప్రతి నలుగురిలో ఒకరు టీడీపీ(Tdp) సభ్యులుగా చేరాలనుకుంటున్నారని తెలిపారు. దేశంలోనే టీడీపీకి ఉన్న బలం మరే పార్టీకి లేదన్నారు. రూ. 100 సభ్యత్వంతో రూ. 5 లక్షల బీమా అందించే ఏకైన పార్టీ టీడీపీ అని చెప్పారు. కార్యకర్తల సంక్షేమం కోసం రూ. 130 కోట్లు ఖర్చు చేశామని చంద్రబాబు పేర్కొన్నారు.

Tags:    

Similar News