సాలూరుకు పవన్ కల్యాణ్.. పర్యటనకు సర్వంసిద్ధం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ..
దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(AP Deputy CM Pawan Kalyan) శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం గన్నవరం నుంచి ఉదయం 9.30 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు(Visakha Airport)కు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన సాలూరు(Salur)కు పవన్ వెళ్తారు. ఉదయం 11.30 గంటలకు సాలూరు డిగ్రీ కాలేజ్(Saluru Degree College)కు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బసలో కొద్దసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం సాలూరు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు మక్కువ మండలం బాగుజోల చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారు. ఆ తర్వాత రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత అక్కడ గిగిజనులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు.. ఆ కార్యక్రమాలను ముగించుకొని తిరిగి సాయంత్రానికి విశాఖ చేరుకుంటారు. అక్కడ నుంచి తిరిగి గన్నవరం చేరుకుంటారు. ఈ మేరకు పర్యటనకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. అటు జనసేన నేతలు కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు.