Tdp: టీడీపీకి బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక బరిలో సొంత మహిళా నేత

ఉమ్మడి విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సొంత మహిళా నాయకులు సుధారాణి ఊహించని షాక్ ఇచ్చారు. ..

Update: 2024-11-11 11:52 GMT

దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC elections) తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party)కి సొంత మహిళా నాయకులు సుధారాణి ఊహించని షాక్ ఇచ్చారు. ఎన్నికల ఎన్నికల్లో అనూహ్యంగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. గతంలో ఆమె భర్త రఘురాజు ఎమ్మెల్సీగా పని చేశారు. ప్రస్తుతం సుధారాణి ఎస్.కోట వైస్ ఎంపీపీగా, స్టేట్ టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. అయితే ఎమ్మెల్సీ అవ్వాలనే ఇంట్రెస్ట్‌తో తాను ఇండిపెంటెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. తన నామినేషన్ విషయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని సుధారాణి స్పష్టం చేశారు.

కాగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీటు ఎవరికి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో సుధారాణి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం ప్రస్తుతం ఉమ్మడి విజయనగరంలో హాట్ టాపిక్‌గా మారింది. మరి సుధారాణి నామినేషన్ పట్ల తెలుగుదేశం పార్టీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.


Similar News