AP Govt: 3 ప్రధాన సంస్థలతో ప్రభుత్వం కీలక ఒప్పందాలు
3 ప్రధాన సంస్థలతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది.....
దిశ, వెబ్ డెస్క్: యువతకు ఉద్యోగాలే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం(AP Govt) కృషి చేస్తోంది. రాష్ట్రానికి ప్రముఖ సంస్థలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయని భావిస్తోంది. ఇందులో భాగంగా సొసైటీ ఫర్ ఎంప్లాయ్ మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ ప్రైజ్ డెవలప్ మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (సీడప్)ను ఏర్పాటు చేసింది. ఈ సీడప్ ద్వారా యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంచేందుకు ప్రయత్నం చేస్తోంది. తాజాగా 3 సంస్థలతో సీడాప్(Seedup) ఒప్పందాలు చేసుకుంది. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేశ్ సమక్షంలో సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఒప్పందాలు జరిగాయి. 2 కామ్స్ గ్రూప్, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, సెంచూరియన్ సంస్థలతో ఈ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
రాష్ట్రంలో ఎంటర్ ప్రైజ్ డెవలప్ మెంట్, స్వయం ఉపాధి, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల ఆదాయాన్ని పెంచడం, అదనపు ఆదాయం కల్పించడం ఈ ఒప్పందాల ప్రధాన లక్ష్యమని మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) తెలిపారు. రాబోయే అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు సీడాప్ పెద్దఎత్తున స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ(Skill development training) కార్యక్రమాలు నిర్వహిస్తోందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.