ఏసీబీకి చిక్కిన మహిళా అధికారి..
దిశ ప్రతినిధి, వరంగల్: జిల్లాకు చెందిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు సోమవారం లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులకు పట్టుబడ్డారు. వరంగల్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ జ్యోతి, సీనియర్ అసిస్టెంట్ రహీమ్ పాషా రూ. 2 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. యాకయ్య అనే వ్యక్తి నుంచి జీఎస్టీ క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం రూ.5 వేలు లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో హన్మకొండ హంటర్ రోడ్ లోని కార్యాలయంలో రూ. 2 వేలు […]
దిశ ప్రతినిధి, వరంగల్: జిల్లాకు చెందిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు సోమవారం లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులకు పట్టుబడ్డారు. వరంగల్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ జ్యోతి, సీనియర్ అసిస్టెంట్ రహీమ్ పాషా రూ. 2 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. యాకయ్య అనే వ్యక్తి నుంచి జీఎస్టీ క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం రూ.5 వేలు లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో హన్మకొండ హంటర్ రోడ్ లోని కార్యాలయంలో రూ. 2 వేలు లంచం డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు.